Saturday, 13 June 2026 02:15:47 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఫుట్ పాత్ లను మొక్కలతో నింపాలి.. ఆక్రమణలకు చెక్ పెట్టాలి...

-- అధికారులకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి.

Date : 17 June 2024 06:53 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరంలో ఆక్రమణ చెరలో నలిగిపోతున్న ఫుట్ పాత్ లపై రెండు వరుసలు మొక్కలు నాటి వాటిని రక్షించాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఫుట్ పాత్ ల ఆక్రమణలపై ఉదాసీనత కారణంగా నిజమైన ఫుట్పాత్ లబ్ధిదారులు అయిన పాదాచారులకు తీవ్ర నష్టం జరగడమేగాక ట్రాఫిక్ అంతరాయం జరుగుతోందని కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీహెచ్ రంగయ్య సోమవారం విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభం అయిన నేపథ్యంలో నగర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు ఉన్న ఫుటపాత్ లపై తక్షణమే మొక్కలు నాటాలని ఆయన కోరారు. ఇప్పటికే ఉన్న చెట్లు అనేక సందర్భాల్లో కూలిపోతున్న నేపథ్యంలో వాటికి సమీపంలో కూడా మొక్కలు ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. దశబ్దాలుగా ఆక్రమణలతో ఉన్న ఫుటపాత్ లను కాపాడాల్సిన మున్సిపల్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఆక్రమణదారులు పెట్రేగిపోతున్నారని మండిపడ్డారు. ఒకపక్క ఫుట్పాత్ మరోపక్క రోడ్డు ఆక్రమణకు గురవుతూ తీవ్ర ట్రాఫిక్ జామ్ లతో నగరాన్ని కాలుష్య కాసారంగా తయారు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు దశాబ్దాలుగా మీనామేషాలు లెక్కించడం బాధాకరం. ఫుట్ పాత్ లపై అధికారులు ప్రేక్షక పాత్రకు పరిమితం కావడం పట్ల ప్రజల్లో అసహనం నెలకొంది. పాదా చారుల హక్కుల రక్షణలో అధికారుల వైఫల్యం పలు సందర్భాల్లో పాదాచారుల ప్రాణాల మీదకు తెస్తోంది.

వాహనాల., ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగించేందుకు గాను కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి అనేక సందర్భాల్లో రోడ్లు విస్తరణ చేయడం తెలిసిందే. అలాంటి విలువైన స్థలాలు ఆక్రమణ జరుగుతున్నాయి. పోలీస్ లు, మున్సిపల్ అధికారులు బలమైన చర్యలు తీసుకోవాలి చాలానాలు 100/-, 50 /- రూపాయలు మాత్రమే వేస్తుందటంతో ఆక్రమణదారులు మరింతగా రెచ్చిపోతున్నారు. నిత్యం వేలాదిగా కొత్త వాహనాలు రోడ్డేక్కుతున్న నేపథ్యంలో ఇలా ఆక్రమణల కారణంగా కుచించుకు పోతుండటంతో నగరంలో భారీగా కాలుష్యం పేరుకుపోతోంది. ఆక్రమణలు అడ్డుకొని మొక్కలు విరివిగా నాటగలిగితే ప్రయాణం సాఫీగా .., కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుందని రంగయ్య గుర్తు చేశారు . ఇప్పటికైనా జీహెచ్ఎంసీ కమీషనర్ పోలీస్ ఉన్నతాధికారుల సమన్వయంతో ఫుటపాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితుల్లో మార్పు రాకుంటే సమస్యపై కౌన్సిల్ తరపున న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు పేర్కొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :