Saturday, 13 June 2026 12:38:35 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అడ్డంగా బుక్కైన లలిత జువెల్లరీ అధినేత..

Date : 05 August 2024 03:59 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : డబ్బులు ఊరికే రావు.. అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలిత జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ విషయంలోఅధికారులకు చిక్కిపోయారు. ‘పక్క షాపులోనో వెరిఫై చేసుకోండి.. అంటూ కస్టమర్లకు సూచనలిచ్చే ఆయన.. జీఎస్టీ రిటర్న్స్‌లో మాత్రం తప్పుడు లెక్కలు ఇచ్చారు. హైదరాబాద్ పంజాగుట్టలోని లలిత జువెల్లరీ 2017-18 సంవత్సరానికి జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ జీఎస్టీఆర్-9, పేరుతో రూ. 56.61 కోట్లను క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఆయన సమర్పించిన రిటర్న్స్ లెక్కల ప్రకారం రూ. 41.22 కోట్లే రావాల్సి ఉన్నది. వాస్తవానికి రావాల్సన అమౌంట్‌ కంటే రూ. 15.39 కోట్లు ఎక్కువ పొందినట్లు తేలింది. ఈ తప్పుడు లెక్కలను వెరిఫై చేసిన స్టేట్ కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటులోని జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

ఇదే విషయాన్ని కాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కూడా ఆడిటింగ్ సందర్భంగా దీన్ని పసిగట్టింది. జీఎస్టీ విభాగం అధికారులను నిలదీసింది. లలిత జువెల్లరీ సమర్పించిన జీఎస్టీ రిటర్న్స్ వివరాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. వాటిని అందుకున్న తర్వాత విశ్లేషించి అధికారులను వివరణ కోరింది. చివరకు 2022 జూలైన అధికారుల నుంచి కాగ్‌కు రిప్లై వెళ్ళింది. రిటర్న్స్ లో తప్పుడు లెక్కలు చూపించినట్లు గుర్తించామని, డీఆర్‌సీ-1 ప్రకారం లలిత జువెల్లరీకి నోటీసులు ఇచ్చామని, అదనంగా పొందిన రూ. 15.39 కోట్లలో రూ. 14.85 కోట్ల మేర రివర్సల్ అయిందని కాగ్‌కు పంపిన రిప్లైలో ఆఫీసర్లు పేర్కొన్నారు. కానీ మిగిలిపోయిన రూ. 53.52 లక్షలకు సంబంధించి డిపార్టుమెంటు అధికారులు ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదని తన నివేదిక 2022-23 లో కాగ్ పేర్కొన్నది.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :