Tuesday, 28 July 2026 09:46:05 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

నేత కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు...

చేతినిండా పని కల్పించేందుకు ముందుకు వెళుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి టెక్స్టైల్ పార్కు లో యజమానులతో సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్

Date : 04 July 2024 10:16 PM

Telugu Rekha Media - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల : నేత కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం లోని బద్దేనపల్లి టెక్స్టైల్ పార్కు లో యజమానులతో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ టెక్స్టైల్ పార్కులో ప్రస్తుత పరిస్థితి ఏమిటి.? ఎన్ని పరిశ్రమల్లో క్లాత్ ఉత్పత్తి అవుతుంది.? ఎందరికి ఉపాధి కల్పిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం టెక్స్టైల్ పార్కులోని ఒక పరిశ్రమలో క్లాత్ ఉత్పత్తి విధానాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. సిరిసిల్ల లోని నేత కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. కార్మికులకు ఉపాధి చేతి నిండా పని కల్పించడమే ద్యేయంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు.

ఈ క్రమంలో టెక్స్టైల్ పార్కులోని యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. నేత కార్మికుల సమస్య పై సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాతనే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా పలువురు యజమానులు మాట్లాడారు. తమకు విద్యుత్ బిల్లులో 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని, పరిశ్రమల ఏర్పాటుకు ఎన్ఓసీ ఇప్పించాలని, కామన్ ఫెసిల్టేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని తదితర అంశాలను విప్ దృష్టికి వారు తీసుకెళ్లారు. దీంతో విప్ స్పందిస్తూ ఈ విషయాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్ళి చర్చిస్తామని స్పష్టం చేశారు. నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని, యజమానులకు సైతం బకాయిలు విడతల వారీగా విడుదల చేయిస్తున్నామని తెలిపారు. నేత కార్మికుల సమస్యలు, భవిషత్ కార్యాచరణ పై చరించేందుకు త్వరలో అన్ని సంఘాల నాయకులు, కార్మికులు, యజమానులు, ఆసాములతో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. సమావేశంలో చేనేత జౌళి శాఖ ఆర్ డీడీ వెంకట్రావు, ఏడీ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: