Tuesday, 28 July 2026 07:18:02 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

బస్సు కింద పడుకుని యువకుడు చేసిన స్టంట్‌పై సజ్జనార్ సీరియస్...

Date : 22 June 2024 01:27 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడుకొని ఓ యువకుడు చేసిన వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఓ యువకుడు ఆర్టీసీ బస్సు కింద పడుకుని స్టంట్ చేసినట్లుగా ఓ వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వీడియోను బాగా గమనిస్తే.. అది ఫేక్ అని తెలిసిపోతుంది. ఎవరో గ్రీన్ మ్యాట్‌లో వీడియో చిత్రీకరించి, దాన్ని బస్సు కింద పడుకున్నట్లుగా ఎడిట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, ఈ వీడియోపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని సజ్జనార్ తెలిపారు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఇలాంటి వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారని తెలిపారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదని హితవుపలికారు. లైక్‌‌లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉందన్నారు. కొందరు తమ సరదా కోసం ఇలాంటి వీడియోలను ఎడిట్ చేసి షేర్ చేస్తే.. వాటి కారణంగా ఇతరులు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలాంటి ఘటనలను టీజీ ఆర్టీసీ సీరియస్‌గా తీసుకుంటుందని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: