Wednesday, 29 July 2026 09:53:23 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

దేశాన్ని అప్పుల ఊబిలో దించిన ప్రధాని మోడీ...

- - సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్...

Date : 04 July 2024 07:55 PM

Telugu Rekha Media - తెలంగాణ / ఖమ్మం : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పుడు విధానాల కారణంగా దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని. దేశంలో 150 లక్షల కోట్ల రూపాయిల అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని, మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగా ప్రతి మనిషి పై లక్ష యాభై వేల రూపాయలు అప్పు వేస్తున్నారని ఆరోపించారు. సుందరయ్య భవన్ లో జరిగిన పార్టీ ఖమ్మం అర్బన్ రాజకీయ శిక్షణా తరగతులను శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోవైపు తీవ్రమైన అధిక ధరలు ప్రతి వస్తువుపై జిఎస్టి వేస్తూ రెండు రకాల దోపిడీని ప్రజల నుండి గుంజుకుంటున్నారని. ధరల పెరుగుదల కారణంగా ప్రజల జీవన విధానం క్షీణిస్తుందని 60 శాతం మంది ప్రజలకు పౌష్టికాహార లోపంతో ఉన్నారని 80 శాతం మంది ప్రజలకు వైద్య సౌకర్యాలు అందటం లేదని మరోవైపు కార్పొరేట్ గుత్తా పెట్టుబడుదారుల శక్తుల అనుకూలంగా ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టు పెడుతున్నారని దేశ సంపదను కారుచౌకగా కట్టబెడుతున్నారని 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను అమ్మేశారని మరోవైపు 12 లక్షల కోట్ల రూపాయలను పన్ను రాయితీ ఇచ్చి రద్దు చేశారని ఆరోపించారు. ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఆందోళనలు మరింతగా చేయవలసిన అవసరం వుంది అని తెలిపారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. దేశంలో మత ఉన్మాదాన్ని పెంచే పనిలో మోడీ ప్రభుత్వం ఉందని, రాబోయే కాలంలో మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరిగే రాజకీయ ఆందోళనల పార్టీ శ్రేణులను భాగస్వాములుగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్, నాయకులు మీరా సాహెబ్, బత్తిని ఉపేంద్ర మండల కార్యదర్శి అర్బన్ తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :