Sunday, 01 March 2026 11:52:25 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఫిట్ నెస్ లేని స్కూలు బస్సులపై కేసులు...

-- విద్యా సంస్థల బస్సులపై మూడవ రోజు తనిఖీలు

Date : 14 June 2024 07:51 PM

Telugu Rekha Media - తెలంగాణ / రంగారెడ్డి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఫిట్ నెస్ లేని 34 బస్సుల ( విద్యాసంస్థల బస్సులు) పై కేసులు నమోదు చేసినట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ వెల్లడించారు. విద్యా సంస్థల బస్సులపై మూడవ రోజు ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా వ్యాప్తం గా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫిట్ నెస్ లేని, పన్నులు చెల్లించని 34 బస్సులపై కేసు నమోదు చేయడం జరిగిందని అయన అన్నారు. ఈ రోజు 4 బృందాలు గా ఏర్పడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తం గా రవాణా శాఖ అధికారులు తనిఖీ లు చేపట్టారు. ఈ సందర్భం గా డి టి సి చంద్ర శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఫిట్ నెస్ లేని, 15 సంవత్సరాలు దాటిన విద్యాసంస్థల బస్సులు ఎట్టి పరిస్థితులలో రోడ్ల పైకి తిప్పరాదని తెలిపారు. అనుభవం గల , 60 సంవత్సరాలు మించని డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని సూచించారు. ఈ తనిఖీ లు కొనసాగుతాయని , ప్రతీ విద్యా సంస్థ బస్సు తప్పనిసరిగా సంబంధిత రవాణా శాఖ కార్యాలయం లో ఫి ట్ నెస్ సర్టిఫికెట్ పొందాలని తెలిపారు.ఈ దాడులలో రంగారెడ్డి, మేడ్చల్, ఉప్పల్ రవాణా శాఖ అధికారులు కిరణ్ రెడ్డి, కృష్ణ వేణి, సునీత, నవీన్, ఉపాసిని, ప్రతాప్ రాజా, త్రివేణి, శ్రీనివాస్ , అనూష తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :