Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. వడి బియ్యం, చీర సారెలతో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ‘నాకు సంతోషంగా ఉంది. నాకు కావాల్సిన పూజలన్నీ అందిస్తున్నారు. బాలికలు, యువతులు, మహిళలు ఇలా ఎవరు బోనం సమర్పించినా స్వీకరిస్తా. పంటలు బాగా పండుతాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కోరినన్ని వర్షాలు కురుస్తున్నాయి. పిల్లలకు, గర్భిణులకు, వృద్ధులకు ఎలాంటి ఆపదలు రానివ్వబోనని అమ్మవారు పూనిన ఆమె తెలిపారు. నన్ను చూడాలంటే 48 గంటలు కష్టం అంటున్నారు. ఆమాత్రం కష్టపడలేరా?. ఏమి తెచ్చినా ఆనందంగా తీసుకుంటా. రంగం కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నత అధికారులు హాజరయ్యారు.
Reporter
Telugu Rekha Media