Wednesday, 29 July 2026 10:45:22 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

వరంగల్ వర్షాల కోసం పూజలు...

Date : 24 June 2024 04:07 PM

Telugu Rekha Media - తెలంగాణ / వరంగల్ : తెలంగాణలో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు కురిసినా కొన్ని వరంగల్‌.. సిద్ధిపేట జిల్లాలో వర్షాలు కురవలేదు. వర్షాభావ పరిస్థితులు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో వర్షాలు కురవాలని వరంగల్ జిల్లాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హనుమకొండలోని పద్మాక్షి కాలనీలో పోచమ్మతల్లి, కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు చేశారు మహిళలు. విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు జలకళ సంతరించుకోవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని మహిళలు నీళ్ల బిందెలు ఎత్తుకొని ఆలయాలకు చేరుకుని విగ్రహాలకు జలాభిషేకాలు చేశారు. పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. పౌర్ణమి రోజున పోచమ్మకు ప్రత్యేక పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. గతంలోనూ ఇలాంటి పూజ చేయడం వల్ల తమ మొక్కులు ఫలించాయి అంటున్నారు మహిళలు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోతున్నామని.. ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లాలోను వర్షాల కోసం కప్పల పెళ్లి నిర్వహించారు. రెండు కప్పలకు పసుపు నీళ్లతో స్నానం చేయించి, మంత్రోచ్ఛారణల మధ్య ఆ రెండు కప్పులకు అందరూ చూస్తుండగా వివాహం జరిపించారు. ఈ ఆచారంలో భాగంగా మహిళా రైతులు కప్పలకు నీళ్లు పోస్తుంటే పిల్లలు కర్రకు కట్టిన కొత్తగా పెళ్లయిన కప్పల జంటను తీసుకొని గ్రామమంతా ఊరేగుతూ తిరిగారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: