Wednesday, 29 July 2026 10:48:30 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

నూతన చట్టాలపై అవగాహన అవసరం..

-- కమీషనరేట్ పోలీసులకు ముగిసిన నెల రోజుల శిక్షణా తరగతులు.

Date : 27 June 2024 03:28 PM

Telugu Rekha Media - తెలంగాణ / మంచిర్యాల : దేశంలోని నూతన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐజి, అన్నారు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, నాగరిక్ సురక్ష సంహిత బి ఎన్ ఎస్ ఎస్, సాక్ష్యా అధినియం, 2023 పై పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి నెల రోజులపాటు నిర్వహించిన శిక్షణా తరగతులు ముగిశాయి. అడిషనల్ డిసిపి రాజు అధ్వర్యంలో కమీషనరేట్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐజి హాజరై అధికారులు, సిబ్బంది తో మాట్లాడారు. జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ చట్టాలు అమలులోకి వస్తున్నాయని అన్నారు. ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో నెల రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించామని తెలిపారు. కొత్త చట్టాలు అమలు జరిగిన వెంటనే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరమన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధి విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది కొత్త చట్టాలను నేర్చుకొని అవగాహన పెంచుకోవాలని సూచించారు. కమీషనరేట్ వ్యాప్తంగా నూతన చట్టాలపై పోలీసు అధికారులు, సిబ్బందికి శిక్షణా తరగతులను నిర్వహించి, శిక్షణా తరగతుల నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేసిన అధికారులను అభినందించారు. నెల రోజులపాటు సమయపాలన పాటిస్తూ అందరికీ అర్థమయ్యేలా తరగతులు బోధించిన ఎసిపి మల్లారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ లు రాజేష్, వినీత, సంతోష్, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పి.వంశీకృష్ణ, బి శ్రీనివాస్, కే రాము, ఏ సంతోష్, కే శ్రీనివాస్, కానిస్టేబుల్ కే తిరుపతి, ఎన్. శ్రీనివాస్ లను సిపి ప్రశంస పత్రాలు అందచేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్సీ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ లు రాజేష్, వినీత, తదితరులు పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :