Monday, 14 September 2026 05:21:35 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

రాజన్నసన్నిధిలో బ్రేక్ దర్శనం...

Date : 03 August 2024 08:11 PM

Telugu Rekha Media - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల : దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం నుండి బ్రేక్ దర్శనం అందుబాటులోకి రానుంది. శ్రావణ మాసం మొదటి వారంలోనే బ్రేక్ దర్శనాలను ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే యాదాద్రి ఆలయంలో బ్రేక్ దర్శనాలను పరిశీలించారు. బ్రేక్ దర్శనం టికెట్ ధరను రూ.300గా నిర్ణయించగా, పదేళ్ల లోపు చిన్నా రులను ఉచితంగా అనుమతిస్తామని, ప్రతీ రోజూ ఉదయం 10.15 నుంచి 11.15 గంటల వరకు ఒకసారి, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు మరోసారి బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. ఈ టికెట్ తీసుకున్న భక్తులకు వంద గ్రాముల లడ్డూను ఉచితంగా అందించనున్నట్లు, బ్రేక్ దర్శనం టికెట్లను ఆఫ్లైన్ తోపాటు ఆన్లైన్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. బ్రేక్ దర్శనం సమయంలో, సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: