Thursday, 29 October 2026 07:45:22 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కవితకు సోమవారం బెయిల్.!

Date : 11 August 2024 11:31 AM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకంట్ల కవితకు సోమవారమే బెయిల్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. వారం రోజుల పాటు ఢిల్లీలో హైలెవల్ సీక్రెట్ చర్చలు జరిపి వచ్చిన కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్‌లో మెడికల్ గ్రౌండ్స్ పై కవితకు బెయిల్ వస్తుందన్న సంకేతాలు ఇచ్చారు. వచ్చేవారం కవితకు బెయిల్ వస్తుందని. ప్రాసెస్ లో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మాటల ప్రకారం, కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో లిస్టు అయినట్లుగా బయటకు వచ్చింది. కవిత పదకొండు కేజీల బరువు తగ్గారని, హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్న కారణంగా మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ కోరితే, కోర్టు సంతృప్తి పడితే. మరో కేసులో అంటే ఈడీ కేసుల్లో కూడా బెయిల్ వచ్చినట్లే. అందుకే ఈ కోణంలో ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు. పదిహేడు నెలల పాటు జైల్లో ఉన్న సిసోడియాకు కూడా సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది. వచ్చే వారంలోనే కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సైజుకు. నేతల్ని జైల్లో పెట్టిన సమయానికి పొంతన లేదన్న వాదన ఉంది. వేల కోట్ల అవినీతి చేసిన వాళ్లు కూడా అంత కాలం జైల్లో ఉండలేదన్న భావన ప్రజల్లో వస్తోంది. కవిత కూడా మార్చి పదిహేనో తేదీన అరెస్టయ్యారు. మిగిలిన వారు అప్రూవర్లుగా మారితే బెయిల్ ఇచ్చేశారు. కవిత మాత్రమే జైల్లో ఉన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :