Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : తల్లిపాలు పిల్లలకు అమృతం వంటివని అంగన్ వాడి టీచర్లు అన్నారు. కోరుట్ల పట్టణంలోని రహమత్ పురా-2 అంగన్ వాడి కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్ వాడి టీచర్లు చింత అరుణ, వి.ప్రేమలత, అన్నం లక్ష్మి, సీహెచ్ పుష్పలత, ఆర్. రాజమణి, ఏ. లక్మి తదితరులు మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు వరం అని, పిల్లల్లో లోప పోషణ స్థాయి పెంపొందించడానికి తల్లలకు సూచించారు. బిడ్డకు తల్లి పాలు ఇవ్వడంలో అంతరాలు తొలగించి తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ చాటి చెప్పేందుకే తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
Reporter
Telugu Rekha Media