Wednesday, 17 June 2026 02:04:47 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కొండగట్టు అంజన్న సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

Date : 29 June 2024 05:55 PM

Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శిం చుకున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో కొండగట్టుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు స్థానికులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో శనివారం ఉదయం ఆయన కొండగట్టుకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ముందుగా హైదరాబాద్‌ శివారులోని తుర్కపల్లిలో పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. తుర్కపల్లి నుంచి బయల్దేరిన తర్వాత సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద కూడా జనసేన అధినేతకు ఘనస్వాగతం లభించింది. అక్కడ పవన్‌ కల్యాణ్‌ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు అందించిన వీరఖడ్గంతో ఆయన ఫొటోలకు పోజులి చ్చారు. అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయల్దేరి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్‌ కల్యాణ్‌ వారాహి అమ్మవారి దీక్షను చేప ట్టారు. 11 రోజుల పాటు నిష్టతో ఈ దీక్షను పాటించ నున్నారు. ఈ క్రమంలోనే తమ ఇల వేల్పు అయిన కొండగట్టు ఆంజ నేయ స్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. కాగా, గత ఏడాది ఎన్నికల కు ముందు ప్రచారం మొద లుపెట్టిన పవన్‌ కల్యాణ్‌. తన వారాహి ప్రచార రథానికి కొండగట్టులోనే ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారాహి విజయయాత్రను నిర్వహించారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: