Tuesday, 28 July 2026 08:54:45 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

వ్యక్తి దేహ దారుఢ్యానికి, మానసికోల్లాసానికి యోగా సర్వరోగ నివారిణి...

-- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

Date : 10 July 2024 09:03 PM

Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : హనుమకొండ “శ్రీ రామకృష్ణ సేవా సమితి భవన్“లో బుదవారం యోగా శిక్షణ శిబిరాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి-నీలిమా దంపతులు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యోగా గురువు రవీంద్రాచారి నిర్వహణలో జరిగిన యోగా శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి “యోగా” ను తన జీవితంలో నిత్యకృత్యంగా ఆచరించాలని తద్వారా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మానసిక వికాసాన్ని పొందడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత సేవా సమితి గ్రంథాలయాన్ని సందర్శించి అవసరమైన భగవద్గీత, రామాయణ-భాగవతాది ఆధ్యాత్మిక గ్రంథాలను, పుస్తకాలను సమకూర్చుతానన్నారు.సేవా సమితి అధ్యక్షులు కటంగూరు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ సేవా సమితి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను సమాజం ఆచరింప జేయుటలో, యువతను సత్శీలురుగా తీర్చి దిద్దుటలో, ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని కల్పించుటలో అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. సమితి కార్యక్రమాలయెడ సదవగాహన కలిగిన పెద్దలు, భక్తులు, కార్యకర్తల సహాయసహకారాలతో ఇప్పటికి సుమారు కోటిన్నర వ్యయంతో ఈ స్థితిలో నున్న భవనంయొక్క నాలుగు స్లాబులు పూర్తయినవి. పూర్వ వరంగల్ జిల్లాకు ఇదొక పర్యాటక దివ్య మందిరంగా బాసిల్లుతుందన్నారు.

తర్వాత 59వ డివిజన్ మునిసిపల్ కార్పొరేటర్ గుజ్జుల వసంత-మహేందర్ రెడ్డిలు విశిష్ట అతిథులుగా హాజరవడం హర్షణీయం.సేవా సమితి బాధ్యులు, భక్తులు, కార్యకర్తలు, శ్రీనివాస స్వామి, జినుగు విష్ణువర్ధన్ రెడ్డి, సూర్య, కెవి రావు, నవీన్ రెడ్డి, అశోక్ రెడ్డి, బ్రహ్మానందం, వెంకన్న, వేణుగోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అంజనీదేవి, మూల సరోజన, అనిత, పార్వతి, వీణ తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: