Tuesday, 28 July 2026 09:46:07 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాంటీ డ్రగ్స్ యాడ్ కు దర్శకత్వం వహించిన సంజీవ్ రెడ్డి...

Date : 29 June 2024 05:11 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో కోసం యాంటీ డ్రగ్ యాడ్ ను తయారుచేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ యాడ్ కు దర్శకత్వం వహించారు యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి. ఈ యాడ్ ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రిలీజైంది. ఈ యాడ్ ను టామాడ మీడియా ఎగ్జిక్యూట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఈ యాడ్ గురించి ట్వీట్ చేస్తూ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వచ్చేవారం నుంచి ఈ యాడ్ ను తెలంగాణలోని ప్రతి థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు. డ్రగ్స్ కు బానిస కావడం వల్ల యువత తమ బంగారు భవిష్యత్తు ఎలా పాడుచేసుకుంటున్నారో ఈ యాడ్ లో ఆకట్టుకునేలా తెరకెక్కించారు సంజీవ్ రెడ్డి. డ్రగ్స్ అమ్మేవారు, కొనేవారిపై చర్యలు తీసుకుంటూనే డ్రగ్స్ కు బానిసైన వారికి చేయూత అందించి, వారిని మళ్లీ మంచి మార్గంలో పెట్టేందుకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఎలాంటి సపోర్ట్ అందిస్తుందో ఈ యాడ్ లో ఎఫెక్టివ్ గా చూపించారు సంజీవ్ రెడ్డి. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ రెడ్డి స్పందిస్తూ - ఎవరి సినిమాలు చూస్తూ పెరిగి సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నానో ఆ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు భాగస్వామి అయిన తెలంగాణ ప్రభుత్వ యాంటీ డ్రగ్ థియేట్రికల్ యాడ్ లో నేనూ ఒక భాగమైనందుకు, ఇక చాలు ఈ జన్మ కి అనిపిస్తుంది. కానీ, మళ్ళీ ఈ కోరికలకు అంతే ఉండదు. అని అన్నారు. అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్ తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన సంజీవ్ రెడ్డి...ప్రస్తుతం విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా "సంతాన ప్రాప్తిరస్తు" అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :