Monday, 14 September 2026 04:48:17 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

యువత మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి...

-గ్రామాలలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. -మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లపల్లి రాజు.

Date : 02 August 2024 08:06 PM

Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి/మంథని : యువత గంజాయి, మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లపల్లి రాజు సూచించారు.శుక్రవారం రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో రామగిరి ఎస్సై సందీప్ కుమార్, ముత్తారం ఎస్సై మధుసూదన్ ఆధ్వర్యంలో మంథని సర్కిల్లోని పోలీస్ సిబ్బందితో కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంథని సీఐ రాజు ముఖ్యఅతిథిగా హాజరై గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా సరైన పత్రాలు లేనటువంటి ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిపైన చాలాన్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఎవరైనా సేవించిన విక్రయించిన వారి వివరాలను పోలీసు వారికి చేరవేయాలని సూచించారు. వాటి వల్ల కలిగే అనర్ధాల గురించి ప్రజలకు వివరించి చెప్పారు.మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. మీకు తెలియని ఏదైనా ఫోన్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చి మిమ్మల్ని ఏవైనా ప్రలోభాలకు గురి చేసిన వెంటనే మీరు 1930 నెంబర్ కు కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందాలన్నారు.సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరైనా అనుచిత పోస్టులు పెట్టిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల మర్యాదగా నడుచుకోవాలన్నారు.మీకు ఎటువంటి సమాచారం తెలిసిన తక్షణమే 100 నెంబర్ కు కాల్ చేసి పోలీస్ వారి సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు మంథని సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: