Saturday, 13 June 2026 02:31:53 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఆర్టీసీలో డిజిటల్ పేమెంట్స్..

Date : 27 June 2024 02:16 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్ వెళ్లాల్సిన శ్రీనివాస్‌ హయత్‌నగర్‌లో బస్ ఎక్కాడు. కండాక్టర్‌ టికెట్‌ కొట్టి ఇచ్చాడు. 40 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. శ్రీనివాస్‌ మెల్లిగా ఐదు వందల రూపాయల నోట్ తీసి కండాక్టర్ చేతిలో పెట్టాడు. అసలే ఫస్ట్ ట్రిప్‌ కావడంతో చిల్లర లేదని చెప్పి టికెట్‌పై 460 అని రాసి ఇచ్చాడు. ఫోన్ చూస్తూ తను దిగాల్సిన స్టాప్‌లో దిగిపోయాడు. 460 రూపాయలు మర్చిపోయాడు. 40 రూపాయలు చిల్లర లేనందుకు శ్రీనివాస్‌కు 460 చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇది ఒక్క శ్రీనివాస్‌ అనుభవమే కాదు. మీరు హైదరాబాద్‌లో ఉండి ఉంటే కచ్చితంగా ఇలాంటి అనుభవాన్ని ఫేస్ చేసి ఉంటారు. ఆ కండాక్టర్ మంచి వాడు కాబట్టి చీటీపై రాసి ఇచ్చాడు. వేరే వాళ్లు అయితే ఏకంగా వాగ్వాదమే పెట్టుకుంటారు. చిల్లర ఎక్కడి నుంచి తీసుకురావాలని చిర్రుబుర్రులాడుతారు.

ఇప్పుడు అలాంటి వాటికి అవకాశం లేకుండా చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. హైదరాబాద్‌ సిటీ బస్‌లలో డిజిటల్ పేమెంట్స్ తీసుకురానుంది. ప్రయోగాత్మకంగా నిర్వహించిన ప్రక్రియ విజయవంతం కావడంతో ఇప్పుడు మరికొన్ని రూట్‌లలో ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. ఆర్టీసీ బస్‌లలో ప్రయాణించే వాళ్లకు చిల్లర బాధ అంతా ఇంతా కాదు. డిజిటల్ చెల్లింపులు వచ్చాక బయట చిల్లర దొరకడమే కష్టంగా మారిపోయింది. ఏటీఎంకు వెళ్లినా అక్కడ కూడ వంద, 200, 500 నోట్‌లే వస్తున్నాయి. దీంతో బస్‌ ఎక్కే వాళ్ల వద్ద చిల్లర కనిపించడం చాలా అరుదు. దీంతో నిత్యం ఆర్టీసీ సిబ్బందితో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని గమనించిన తెలంగాణ ఆర్టీసీ డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను బండ్లగూడ డిపోలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టింది. ఇది విజయవంతం కావడంతో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను మిగతా ప్రాంతాలకు విస్తరించాలని చూస్తోంది. బండ్లగూడలోని 70 బసుల్లో ఫోన్‌పై, గూగుల్‌పే, పేటీఎం, డెబిట్ కార్డు, క్రెడిట్‌కార్డు ఉంటే టికెట్ తీసుకోవచ్చు. సుమారు నెల రోజుల నుంచి విజయవంతంగా నడుస్తుందీ ప్రక్రియ. బండ్లగూడ డిపో బసుల్లో డిజిటల్ చెల్లింపుతో టికెట్ తీసుకోవడంలో ఉన్న లోపాలు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రయాణికుల ఇబ్బందులు, టికెట్ ఇవ్వడానికి చెల్లింపులకు ఎంత టైం పడుతుంది ఇలా అన్నింటినీ పరిశీలించింది ఆర్టీసి. పెద్దగా సాంకేతిక సమస్యలు తలెత్తలేదని గ్రహించి మిగతా ప్రాంతాలకు విస్తరించాలని ఆలోచనలో ఉందీ ఆర్టీసీ. గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపు 2900 బస్సుల్లో ఈ డిజిటల్ చెల్లింపు ప్రక్రియను త్వరలోనే ప్రవేశ పెట్టనున్నారు. దీని వల్ల 15 లక్షల మందికిపైగా ప్రయాణికులకు మేలు జరుగుతుందని సిబ్బందిపై చిల్లర ఒత్తిడి తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :