Saturday, 13 June 2026 12:52:47 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు...

-- మల్టీజోన్ ఐజిపి ఏవి రంగనాథ్.

Date : 20 June 2024 10:47 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి శ్రీ ఏ. వి. రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణలో ఎస్ ఐ, మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో పాటు ఎస్ ఐ, భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు పాల్పడంతో ఇతనిపై ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. సదరు ఎస్ఐ తన హోదా అడ్డుపెట్టుకొని మరో ముగ్గురు మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో పాటు ఎస్ఐ తరుచుగా లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వ్యవహారం పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉంది. ఎస్ఐ పై ఈ పరిస్థితుల్లో విచారణ చేయడం సరైన నిర్ణయం కాదనే ఆలోచనతో కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ పై, ఎలాంటి విచారణ లేకుండానే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం సర్వీసు నుండి శాశ్వతంగా తొలగిస్తునట్లుగా మల్టీ జోన్ ఐజిపి ఏవి. రంగనాథ్ వెల్లడించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :