Saturday, 13 June 2026 12:47:37 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ స్టేడియం తీసుకొస్తాం...

తెలంగాణలో త్వరలో క్రీడా విధానం- స్పోర్ట్స్ పాలసీ -- శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Date : 02 August 2024 10:37 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిఖత్ జరీన్‌కు ఆర్థిక సాయం చేయడంతో ఇంటి స్థలం కేటాయిస్తామని, టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు విద్యార్హత లేకున్నా గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నామని స్పష్టం చేశారు. శాసన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో త్వరలో క్రీడా విధానం తీసుకొస్తామని, హర్యానా క్రీడా విధానం పరిశీలిస్తున్నామని, త్వరంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని, స్పోర్ట్ పాలసీపై ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో మరో క్రికెట్ మైదానం వస్తుందని, యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, సరూర్‌నగర్ స్టేడియాల్లో క్రీడలు తగ్గాయని, ఎల్‌బి స్టేడియంలో క్రీడలు తగ్గడంతో పాటు రాజకీయ కార్యకలాపాలు పెరిగాయన్నారు. హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం తీసుకొస్తామని, స్కిల్ యూనివర్సిటీ సమీపంలో అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తామని, బ్యాగరికంచెలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బిసిసిఐతో చర్చలు జరిపామని రేవంత్ రెడ్డి తెలియజేశారు. క్రీడల కోసం బడ్జెట్‌లో రూ.321 కోట్లు కేటాయించామని, హర్యానా తరహాలో క్రీడాకారులను పోత్సహిస్తామన్నారు. భూముల లభ్యత చూసి మండల కేంద్రాల్లో స్టేడియాలు నిర్మిస్తామని, తెలుగువర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :