Wednesday, 29 July 2026 10:42:58 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కోకాపేట వరకు రెండో దశలో మెట్రో రైలు...

Date : 26 July 2024 10:43 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : నగరంలో మెట్రో రైలు రెండో దశ, దూరం అంచనాలు పెంచారు. రెండో దశలో ప్రభుత్వం ప్రతిపాదనలను సమీక్షించి కొత్త ప్రతిపాదనలను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మొదట రాయదుర్గం నుంచి విప్రో కూడలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని యూఎస్ కాన్సులేట్ వరకు 8 కిమీ. దూరాన్ని ప్రతిపాదించారు. అయితే ఇప్పుడు దీనిని కోకాపేటలోని నియోపోలిస్ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మరో 3.3 కిమీ. పెరిగింది. దాంతోపాటు అంచనాలు కూడా పెరిగాయి.నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణ గుట్ట, మైలార్ దేవ్ పల్లి కూడలి నుంచి జల్ పల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు మొదట 29 కిమీ. ఎయిర్ పోర్ట్ మెట్రో మార్గాన్ని అంచనా వేశారు. అయితే దీనిని 4 కిమీ. పెంచారు. ఇదే కారిడార్ లో మైలార్ దేవ్ పల్లి నుంచి ఆరాంఘడ్, కొత్త హైకోర్టు వరకు 5 కిమీ. మెట్రో మార్గాన్ని పెంచారు. రెండో దశలో దీనిని ప్రతిపాదించారు. కాగా నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మెట్రో ఇంటర్ చేంజ్ స్టేషన్లను అభివృద్ది చేయనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: