Monday, 14 September 2026 05:21:41 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అహింస గురించి మాజీ ఎమ్మెల్యే మాట్లాడడం విడ్డూరం...

-- వందశాతం రైతు రుణమాఫీ చేసి తీరుతాం. -కాంగ్రెస్ పార్టీ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపింది. -పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు

Date : 24 July 2024 11:22 PM

Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి : అహింస గురించి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, రైతు నాయకుడు గుండా రాజు లు అన్నారు. బుధవారం మంథని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని రైతులతో, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు 100% రెండు లక్షల వరకు రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేసి తీరుతామని అన్నారు.100% రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని, దశలవారీగా రుణమాఫీ పక్రియ జరుగుతుందని ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. రైతు రుణమాఫీ ఒకేసారి చేయడం దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని, నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో, నేడు సీఎం రేవంత్ రెడ్డి, నేతత్వంలో కాంగ్రెస్ పార్టీ రైతుల కళ్ళల్లో ఆనందన్ని నింపిందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతు రుణమాఫీ జరగలేదని ఆయన ఆరోపించారు. . బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో రక్తపాతం జరిగిందని, దానికి బాధ్యులైన వారికి త్వరలోనే శిక్ష పడుతుందని ఆయన అన్నారు. జీవో నెంబర్ 567 గురించి చెప్పి రైతులను ఆందోళనకు గురి చేయవద్దని ఆయన కోరారు. 567 జీవో ద్వారా ఒకే కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కలిసి రుణమాఫీ పొందకుండా, నకిలీ పాస్ పుస్తకాలతో రుణమాఫీ తీసుకున్న వారికి మాత్రమే వర్తించకుండా జీవో తీసుకువచ్చారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ జరుగుతుందని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ పాలనలో రైతులు వడ్ల బస్తాకు ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు కటింగ్ జరిగిందని, కాంగ్రెస్ పాలనలో కటింగ్ లేకుండా చేశామన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతుల వడ్ల బస్తాల నుంచి కటింగ్ జరగలేదు అని చెప్పడానికి బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వోడ్నాల శ్రీనివాస్, పోలు శివ, కుడుదుల వెంకన్న, జనగామ నర్సింగరావు, నూకల బానయ్య, గోటికారి కిషన్ జి, మంతెన సత్యం, వేరవేన లింగయ్య యాదవ్, మంతెన శ్రీనివాస్, రామ్ రాజశేఖర్, పేరవేన మోహన్ యాదవ్, బూడిద శంకర్, మంతెన సురేష్, సింగారపు కిష్టయ్య, గుండా పాపారావు, పెంటరి రాజు, మంథని శ్రీనివాస్, నరేడ్ల ఓదెలు, కాజీపేట బాపు, జనగామ సడవలి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :