Sunday, 13 September 2026 04:03:51 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

నీతి అయోగ్ కేటాయించిన లక్ష్యాలను సాధించాలి...

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ...

Date : 06 July 2024 12:04 PM

Telugu Rekha Media - తెలంగాణ / భూపాలపల్లి : మండలానికి నీతి ఆయోగ్ కేటాయించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మహా ముత్తారం మండలాన్ని నీతి ఆయోగ్ అస్పరేషన్ బ్లాక్ గా ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం మండలంలో సంపూర్ణతా అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ముందుగా ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించారు. అనంతరం ఉదయ శ్రీ మహిళా సంగం తయారు చేస్తున్న విద్యార్థులు యూనిఫామ్స్ కుట్టు పనులను పరిశీలించారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంపిడివో కార్యాలయం నుండి కేజిబివి పాఠశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కెజిబివి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సంపూర్ణతా అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా గర్భిణీ స్త్రీలను గుర్తించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి మధుమేహం, రక్త పరీక్షలు చేయడం, గర్భిణీ స్త్రీలకు అనుబంధ పోషకాహారం నూరు శాతం అండివిధంగా చర్యలు, భూ పరిరక్షణకు భూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేయడం, స్వయం సహాయ సంఘాల మహిళలకు నూరు శాతం రివాల్వింగ్ ఫండ్ మంజూరుతో పాటు అనుబంధంగా కేటాయించిన 49 ఇండికేటర్ల లక్ష్యాలను నూటికి నూటికి నూరు శాతం సాధించాలని ఆయన పేర్కొన్నారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను ఎన్నోవేషన్ కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గర్భిణీలకు అంగన్వాడి కేంద్రాల్లో పోషకాహారం అందిస్తున్నామని ప్రతి ఒక్కరు అంగన్వాడి కేంద్రాలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. మహిళల ఆర్థికాభివృద్ధిలో భాగంగా స్వయం సహాయక సంఘాలు బలోపేతానికి నూటికి నూరు శాతం రివాల్వింగ్ పండు మంజూరు చేయాలని ఆయన తెలిపారు. మన జిల్లా మన జిల్లా ఓడిఎఫ్ ప్లస్ కావాలని ఆయన పేర్కొన్నారు. మహా ముత్తారం మండలంలో ప్రతి ఇంటి నుంచి తడి పొడి వ్యర్దాలు సేకరణ ప్రక్రియ పక్కాగా జరగాలని, సేకరించిన వ్యర్ధాలను డంపింగ్ యార్డుల్లో వర్మి కంపోస్ట్ చేసి వనమహోత్సవం మొక్కలకు వినియోగించాలని ఆయన సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ ఇతర సౌకర్యాలు కల్పనకు ఇతర మరమ్మతు పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మన జిల్లాలోని మహాముత్తారం, పలిమెల మండలాల సమగ్రాభివృద్ధికి నీతి ఆయోగ్ యాస్పిరేషన్ బ్లాకులుగా ప్రకటించినట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 112 జిల్లాలను నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ జిల్లాలుగా గుర్తించగా వాటిలో మన జిల్లా ఒకటని, తిరిగి మళ్ళీ రెండు మండలాలు అభివృద్ధికి యాస్పి రేషనల్ బ్లాకులుగా ఎంపిక చేసినట్లు ఆయన అన్నారు. మారుమూల మండలాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలని ఆయన పేర్కొన్నారు. జూలై 4 నుండి సెప్టెంబర్ 30వ తేది వరకు దాదాపు మూడు నెలల పాటు జరుగునున్న ఈ ప్రక్రియలో నీతి ఆయోగ్ కేటాయించిన అన్ని అంశాలను కవర్ చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిపిఓ శామ్యూల్, డిపిఓ నారాయణరావు, మహిళా సంక్షేమ అధికారి అవంతిక, డి ఆర్ డి ఓ నరేష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డీఈఓ రాజేందర్, ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: