Saturday, 13 June 2026 02:28:58 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్...

Date : 21 June 2024 05:13 PM

Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి : విశ్వబ్రాహ్మణ జాతి ముద్దుబిడ్డ, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు మరువలేనివని మంథని పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు మోదుంపురం విజయ్ అన్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని మంథని పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి మంథని పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంథని పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు విజయ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాలను, కష్టాలను తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారన్నారు. తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలకుల వల్ల అణగారిపోయి అభివృద్ధికి నోచుకోకుండా ఉందని వారి నుండి విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో మన నీళ్లు,మన నిధులు,మన ఉద్యోగాలు కావాలని, కోరుకున్న వ్యక్తులలో మొదటి వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం నాయకులు తంగళ్ళపల్లి మధుకర్, వంగల తిరుమలేష్,గుండోజు ప్రవీణ్, దేవరకొండ నగేష్,బోగోజు రమేష్, సిరికొండ నాగన్న, సిరికొండ శ్రీనివాస్, కందుకూరి రామ్మూర్తి,బొల్లంపల్లి లక్ష్మణ్, కొమురోజు వేణు లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :