Sunday, 13 September 2026 04:42:34 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అక్రమాల నిగ్గు తేల్చాలి...

జీవో 59 ద్వారా అక్రమ క్రమబద్ధీకరణ కు పాల్పడిన ఫైళ్ల రీవెరిఫికేషన్‌ చేయాలి

Date : 13 June 2024 05:05 PM

Telugu Rekha Media - తెలంగాణ / ఖమ్మం : * జిల్లా మంత్రి తుమ్మల ను కలిసిన సిపిఎం బృందం... ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పేరుతో చోటుచేసుకున్న అక్రమాలపై చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారితో ఈ సమస్య పైన పార్టీ ప్రతినిధి బృందం చర్చించింది. గత ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్‌ 59 ని పక్కదారి పట్టించే విధంగా అక్రమ పద్ధతిలో అనేకమంది క్రమబద్ధీకరణ చేస్తున్నారని వారన్నారు. తక్షణమే క్రమబద్ధీకరణ లిస్టును సమగ్ర రీ వెరిఫికేషన్‌ చేసి తప్పులకు పాల్పడిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని అక్రమ క్రమబద్దీకరణకు పాల్పడిన వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సందర్భంలో ఈ తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పిందని, ఎన్నికల తర్వాత ఒకరిద్దరిపై మాత్రమే చర్యలు తీసుకొని ఈ సమస్యను పక్కకు నెట్టేసినట్టుగా ప్రజలు భావిస్తున్నారని వారన్నారు. తక్షణమే ప్రతి దరఖాస్తు రీ వెరిఫై చేయాలన్నారు.ఎలాంటి నిర్మాణాలు లేని ప్రభుత్వ భూముల్లోనూ ఎప్పటినుంచో నిర్మాణాలున్నట్లు చూపించి, విలువైన భూములను కొందరు వ్యక్తులకు ధారాదత్తం చేశారన్నారు. గతంలో నగరంలో పేదలు గుడిసెలు వేసుకుంటే ఆ స్థానాలను ఖాళీ చేయించారని, తిరిగి అదే స్థానాలలో కొందరు పెద్దలకు ఈ జీవో అడ్డుపెట్టి ఆ స్థలాలను అప్పజెప్పారని వారు విమర్శించారు. ఇల్లు లేకపోయినా ఉన్నట్టు చూపిన వాటిని సాటిలైట్‌ మ్యాప్‌ ద్వారా పరిశీలించాలని వారన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలన్నారు. నగర సమీపాన ఉన్న శివాయిగూడెం పువ్వాడ ఉదయ్‌కుమార్‌ నగర్‌లో అనేకమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే వారిని బెదిరించి వారి దగ్గరున్న పట్టాలు తీసుకొని వాటిని కూడా కొందరు వ్యక్తులు అమ్ముకున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని అక్కడ నివాసం ఉంటున్న పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్‌ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వైవిక్రమ్‌ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు, ఎస్‌. నవీన్‌ రెడ్డి దొంగల తిరుపతిరావు, 3 టౌన్‌ పార్టీ కార్యదర్శి భూక్య శ్రీనివాస్‌, 2 టౌన్‌ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :