Sunday, 13 September 2026 03:58:41 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

రామగుండం ఇంద్రనగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం..

మత్తు పదార్థాల కట్టడికి తొలిసారి నార్కోటిక్ డాగ్స్ను కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో వినియోగం..!

Date : 06 July 2024 02:00 PM

Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇంద్రనగర్ లో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్, ఐజీ అదేశాల మేరకు, గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్ పర్యవేక్షణలో రామగుండం గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడమైనది. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా కాలనీ లో ఇండ్లలలో తనిఖీలు నిర్వహించి కాలనీ వాసులతో ఏసిపి మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ. ప్రజల రక్షణ భద్రత పోలీస్ బాధ్యత అని గ్రామంలో కొత్త వ్యక్తులు నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు గంజాయి, మద్యం, డ్రగ్స్ లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కాలనీ లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్ మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువ త్రాలను కలిగి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. కాలనీ లో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆత్మ హత్యలు లైంగిక వేదింపులు, గంజాయి వంటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాల పై మరియు వివిధ చట్టాలపై ప్రజలను చైతన్యం చేస్తూ మరియు షీ టీమ్ డయల్ 100 గురించి అవగాహన కల్పించడo జరిగింది. యువత గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా మారకుండా కఠిన చర్యలు తీసికోవడం జరుగుతుంది. ఈ క్రమంలో మత్తు పదార్థాల కట్టడికి తొలిసారి నార్కోటిక్ మత్తు పదార్థాలను గుర్తించుటకు శిక్షణ పొందిన, డాగ్స్ ను కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో వినియోగించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, రవీందర్ గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి, గోదావరిఖని ఎస్ఐ లు సమయ్య, శ్రీనివాస్, సుగుణకర్, గోదావరిఖని టూ టౌన్ ఎస్ఐలు సనత్ రెడ్డి, వెంకటేష్ మరియు పోలీస్ సిబ్బంది, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: