Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ కేడర్ కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ లు శుక్రవారం హైదరాబాద్ లోని బస్ భవన్ ను సందర్శించారు. టీజీఎస్ఆర్టీసీ అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను వారు అధ్యయనం చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సజ్జనార్ టీజీఎస్ఆర్టీసీ అమలుచేస్తున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ట్రైనీ ఐఏఎస్ లకు వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మీ పథకం అమలుపై వివరాలు తెలిపారు.
Reporter
Telugu Rekha Media