Telugu Rekha Media - తెలంగాణ / సూర్యాపేట్ : చెస్ క్రీడలో కోదాడ పేరును ఖండాంతరాలకు వ్యాపింపజేసిన అభినవ్ చిరస్మరణీయుడు. సూర్యచంద్రులు ఉన్నంతవరకు చెస్ క్రీడలో అభినవ్ పేరు ఉంటుంది. అభినవ్ ను స్ఫూర్తిగా తీసుకొని చెస్ క్రీడలో యువ క్రీడాకారులు ఎదగాలి ఘనంగా చెస్ ఛాంపియన్ మేకల అభినవ్ జయంతి.
చెస్ క్రీడలో ఆసియన్ ఛాంపియన్ గా ఎదిగి కోదాడ పట్టణ పేరును ఖండాంతరాలకు వ్యాపింపజేసిన మేకల అభినవ్ చిరస్మరణీయుడని టి పి సి సి డెలిగేట్ సిహెచ్. లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. కోదాడ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా చెస్ ఛాంపియన్ మేకల అభినవ్ జయంతి సందర్భంగా దొంగరి. శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అభినవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చెస్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో అభినవ్ మృతి చెందడం భారతదేశ క్రీడా రంగానికి తీరని లోటు అన్నారు. పదేళ్ల వయసులోనే ఆసియన్ ఛాంపియన్ షిప్, ఇరాన్ ప్రపంచ యూత్ చెస్ ఫెస్టివల్, బగాపేసా, స్పెయిన్ ఛాంపియన్ షిప్ లు సాధించి చెస్ క్రీడకు వన్నె తెచ్చిన క్రీడాకారుడు అభినవ్ అన్నారు. అభినవ్ ప్రతిభను మార్గదర్శకంగా తీసుకొని యువకులు చెస్ క్రీడలో రాణించాలని అన్నారు. దేశానికి ఘన కీర్తి సాధించిన అభినవ్ పేరు చెస్ క్రీడలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఉంటుందన్నారు. అభినవ్ తండ్రి మేకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈనెల 26 న నయానగర్ వీధిలో అభినవ్ ఆర్చి స్థానిక ఎమ్మెల్యే పద్మావతి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అభినవ పేరుతో చెస్ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మేకల అభినవ్ తల్లిదండ్రులు మేకల. అరుణ, వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల. కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంగవీటి. రామారావు మాజీ సర్పంచ్, డిసిసి ఉపాధ్యక్షులు పారా. సీతయ్య, కౌన్సిలర్ చందర్ రావు, గంధం యాదగిరి, బిజెపి నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, తెదేపా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వరరావు, సామినేని రమేష్, బషీర్, మాజీ కౌన్సిలర్ కొమరగిరి రంగారావు, డాక్టర్ బ్రహ్మం, ఈదుల కృష్ణయ్య, ముత్తినేని సైదేశ్వరరావు, దొంగరి శ్రీను, ముత్తి నేని కోటేశ్వరరావు, ధనమూర్తి, వెంకట్, సంజయ్, పత్తిపాక జనార్ధన్, గంధం పాండు తదితరులు పాల్గొన్నారు.
Admin
Telugu Rekha Media