Thursday, 30 July 2026 12:01:31 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి.

Date : 24 July 2024 11:15 PM

Telugu Rekha Media - తెలంగాణ / ఖమ్మం : నగరంలో మయూరి సెంటర్ అమరవీల స్తూపం వద్ద నిరుద్యోగ ఉద్యమ కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు అనువోజు వెంకన్న పిలుపుమేరకు సమావేశమై ఉద్యమకారులు మాట్లాడారు . గత తెలంగాణ మలిదశ ఉద్యమంలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా స్వ రాష్ట్ర సాధన కోసం కళాకారుల పాత్ర మరవలేనిదని అన్నారు . కాలికి గజ్జ కట్టి డప్పు సంకనేసుకుని పిల్ల పాపలను భార్యను వదిలి అనేక పట్టణాలలో పల్లెలలో ఆటపాటల ద్వారా దూం దాం చేసి ప్రజలను చైతన్య పరిచి మేల్కొల్పి తెలంగాణ ఉద్యమం వైపు పరుగులు పెట్టించినటువంటి వారు తెలంగాణ ఉద్యమ కళాకారులు . ముఖ్యంగా ప్రతి సభలలో , రాష్ట రోకల్లో , రైలు రోకల్లో వంట వార్పులో తెలంగాణ మార్చ్ అనే పిలుపులో ముఖ్యపాత్ర పోషించారు . తెలంగాణ ఏర్పడ్డాక కళాకారులను గుర్తించి గత ప్రభుత్వం 550 మందికి సాంస్కృతిక సారధిని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా ఇచ్చింది . కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యమానికి ముఖ్యపాత్ర వహించింది ఖమ్మం జిల్లా కళాకారులు . ఇట్టి జిల్లాకు అన్ని జిల్లాల కంటే తీవ్ర అన్యాయం జరిగిందన్నారు . కేవలం కొద్ది మందిని మాత్రమే గుర్తించి ఉద్యోగాలనుచ్చింది . నిజమేనా కళాకారులకు నిరాశ మిగిలింది . గత పది సంవత్సరాలు పాలించిన పాలకులకు మరియు ప్రభుత్వం వారికి ఎన్ని మాలు మా మోర విన్నవించుకున్నా మాకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు . అందుకు గతంలో 10 సంవత్సరాలు ఉన్న ప్రతిపక్ష నాయకులకు కూడా మా కళాకారుల బాధలు గురించి విన్నవించావు . ఈనాటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలకు మరియు ముఖ్యముగా ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేసినప్పుడు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు . మా యందు దయవుంచి మన ప్రభుత్వం పాలనలో మిగిలిన ఉద్యమ నిరుద్యోగ కళాకారులను గుర్తించి సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు ఇప్పించి మా కళాకారుల కుటుంబాలను ఆదుకొని తగిన న్యాయం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో గుడిపల్లి పుల్లారావు , ఆరెంపుల సతీష్ , పత్తిపాటి లక్ష్మీకాంతమ్మ , పాతి కోటి నరసింహారావు , ఎస్.కె ఫక్రుద్దీన్ , పుల్లూరు రాము , నరాటి చంద్రమోహన్ , కొచ్చర్ల గురువయ్య , పెద్దపాక విజయ్ మరియు అనేకమంది నిరుద్యోగ ఉద్యమ కళాకారులు పాల్గొన్నారు .

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: