Saturday, 13 June 2026 12:53:16 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-10 విజయవంతం

జిల్లా లో 30 మoది బాల కార్మికులకు విముక్తి --జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

Date : 02 August 2024 09:28 AM

Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కోసం ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక సబ్- ఇన్స్ పెక్టర్, ముగ్గురు కానిస్టేబుల్స్,ఒక మహిళ కానిస్టేబుల్ ను ప్రత్యేకంగా కేటాయించి చైల్డ్ లైన్ తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు..ఇందులో భాగంగా ఈ సంవత్సరం జులై 1 నుండి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్-10 కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది ఇందులో 30 మంది బాలకార్మికులను గుర్తించి (సిడబ్ల్యుసి) చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచడం జరిగింది.. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. బాలల హక్కులను, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, మరియు ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం జరుగుతుంది అని అలాగే ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్న, ఎక్కడైనా పనిచేసిన, తప్పిపోయిన వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వగలరు అని తెలిపారు. బాలకార్మికులుగా పెట్టుకున్న వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు . పోలీసు శాఖతో కలిసి ఆపరేషన్ ముస్కాన్ -10 విజయవంతం చేయడంలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :