Tuesday, 28 July 2026 06:16:16 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం

హుస్నాబాద్

Date : 19 November 2024 09:38 PM

Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / సిద్ధిపేట : హుస్నాబాద్ లో ప్రజా పాలన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు -2024 కి సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి కళయాత్ర వాహనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈరోజు నుండి డిసెంబర్ 7 వరకు గ్రామగ్రామాన గత సంవత్సర కాలంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో చేపట్టిన కార్యక్రమాల పై సాంస్కృతిక కళా బృందం అవగాహన కల్పించనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సవవత్సర కాలంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గ్రామగ్రామాన ప్రచారం చేయడానికి సమాచార తెలంగాణ ప్రభుత్వం పక్షాన 33 జిల్లాలలో ఇలాంటి వాహనాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తుంది. ఈరోజు హుస్నాబాద్ లో ప్రారంభించుకోవడం జరిగింది.. హుస్నాబాద్ ప్రాంత కళాకారులు కూడా చారిత్రాత్మక చరిత్ర లో ఉన్నారు. ప్రజలందరికీ చైతన్యం కలిగేలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 110 కోట్ల మంది ప్రయాణం 3720 కోట్ల రూపాయలు విలువైన ఉచిత ప్రయాణం చేశారని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ ,ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నాం. పది సంవత్సరాల తరువాత 40 శాతం మెస్ చార్జీలు పెంచుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ,యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లను ప్రారంభిస్తుంది. ప్రజా పాలన ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అవగాహన కల్పించాలి. అణిచివేత లేదు నియంతృత్వం లేదు.. స్వేచ్ఛా ఉంది.. ఎమ్మెల్యేలు మంత్రులను ఎవరినైనా కలవవచ్చు. మీ నిరసనలు తెలపవచ్చు.. ఎవరినైనా కలవవచ్చ్చు. ఇందిరమ్మ జయంతి సందర్భంగా ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం గ్రామాల్లో అందరికి విసృతంగా ఆవాహన కల్పించాలని అన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: