Sunday, 01 March 2026 10:14:21 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు..

--ఇళ్ల స్థలాలు సాధించే వరకు దీక్ష విరమింప చేసేదిలేదన్న జర్నలిస్టులు.

Date : 16 August 2024 05:43 PM

Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / జగిత్యాల్ : ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల జర్నలిస్టులు చేపట్టిన నిరసన దీక్ష 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. జర్నలిస్టుల న్యాయమైన కోరికలు ప్రభుత్వం వెంటనే తీర్చాలని కోరారు. సమస్య పరిష్కారమయ్యే వరకు తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. జగిత్యాల రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు దీక్షా చేపట్టిన జర్నలిస్టులకు తమ సంఘీభావం తెలుపుతూ 14వ రోజు దీక్షలను నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్లస్థలాలు మంజూరు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రజా సేవ కోసమే పనిచేస్తున్న జర్నలిస్టుల న్యాయమైన కోరికను తీర్చే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు జమాల్, తిరుపతి, శేఖర్, అబ్దుల్ సలాం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.ఈ దీక్షలో జగిత్యాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :