Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / జగిత్యాల్ : తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటుతనానికి గురి అవుతున్న బీసీ లకు రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ, ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలలో రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనర్ చైర్మన్ వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు కరీంనగర్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు.
Admin
Telugu Rekha Media