Telugu Rekha Media - రాష్ట్రీయం / అమరావతి : ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ నెల 27 వరకు అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందం పర్యటించనుంది.అమరావతి రాజధాని నగర నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులు సమకూర్చనున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన మరుక్షణం నుంచి అమరావితిలో అభిమృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో నిర్విరామంగా చర్చలు జరుపుతోంది. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి నిర్మాణం కోసం నిధుల సమీకరణ ప్రక్రియ వేగవంతం చేసిన విషయం తెలిసిందే..
Admin
Telugu Rekha Media