Tuesday, 28 July 2026 08:09:03 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

నాణ్యమైన విద్యాబోధనతో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెంచాలి...

-- మంత్రి లోకేష్.

Date : 11 August 2024 11:36 AM

Telugu Rekha Media - రాష్ట్రీయం / అమరావతి : ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలి. అన్ని స్కూళ్ళలో ఇంటర్ నెట్ తప్పని సరిగా ఏర్పాటు చేయండి సిఎంతో సహా అందరం మోడల్ పిటిఎం సమావేశాలకు హాజరవుతాం. గత ప్రభుత్వం వేలకోట్లు వెచ్చిస్తే 2లక్షలమంది విద్యార్థులు ఎలా తగ్గారు? బాల్యం నుంచే మహిళలను గౌరవించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు సాల్ట్ ప్రాజెక్టుపై పాఠశాల విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష.. అమరావతి, నాణ్యమైన విద్యాబోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాల్సి ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు సహకారంతో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ స్లాట్ ప్రాజెక్టు అమలుతీరుపై పాఠశాల విద్య అధికారులు, సంబంధిత ఏజన్సీల ప్రతినిధులతో ఉండవల్లి నివాసంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ. గత ప్రభుత్వ హయాంలో సాల్ట్ ప్రాజెక్టు అమలులో వెనుకబడటంపై కారణాలను తెలుసుకున్నారు. నాడు-నేడు, సాల్ట్ వంటి పథకాలపై గత ప్రభుత్వం వేలకోట్లు ఖర్చుచేసినట్లు కాగితాల్లో చూపుతోందని, అదే నిజమైతే గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2లక్షలమంది విద్యార్థులు ఎందుకు తగ్గారని ప్రశ్నించారు. దీనిపై లోతైన విశ్లేషణ చేసి, నాణ్యమైన విద్య అందించి మెరుగైన ఫలితాల సాధనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. రాబోయే అయిదేళ్లలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్ నెట్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఎసెస్ మెంట్ మరింత శాస్త్రీయంగా ఉండేవిధంగా డిజైన్ లో మార్పులు చేయాలని ప్రథమ్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. డిజిటలైజ్డ్ ఎసెస్ మెంట్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించి ఆన్ లైన్ కు అనుసంధానించడంపై దృష్టిసారించాలని ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ సంస్థను ఆదేశించారు. టీచింగ్ టూల్స్ అబ్జర్వేషన్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ బోధనాపద్ధతులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని లీడర్ షిప్ ఫర్ ఈక్విటీ ఎల్ఎఫ్ఇ, ప్రతినిధులకు సూచించారు. ఆయా ఏజన్సీలు నిర్వహిస్తున్న ఎసెస్ మెంట్, శిక్షణా కార్యక్రమాలు అర్థవంతంగా, ఫలితాల మెరుగుదలకు దోహదపడేలా ఉండాలని అన్నారు. ఇంటర్మీడియట్ లో మార్కులకు బదులుగా గ్రేడింగ్ విధానాన్ని అమలుచేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రజాప్రతినిధులంతా మోడల్ పిటిఎం సమావేశాలకు హాజరై తల్లిదండ్రుల మనోగతాన్ని తెలుసుకుంటామని, ప్రభుత్వ పాఠశాలల మెరుగైన పనితీరు కోసం తల్లులను భాగస్వాములను చేయాలని అన్నారు. బాల్యం నుంచే మహిళలను గౌరవించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, డైరక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు, పిడబ్ల్యుసి ప్రతినిధులు సుచీంద్ర కుమార్, సోనాల్ శివగుండే, సునీత, కె.సురేష్ బాబు ప్రథమ్, దత్తాత్రేయ, మజీద్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్, వైభవ్ పాండే, నాగ సాయికృష్ణ కైవల్య ఫౌండేషన్, సిద్దేష్ శర్మ లీడర్ షిప్ ఫర్ ఈక్విటీ, తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :