Sunday, 01 March 2026 10:14:20 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఆర్డబ్ల్యూఎస్(రూరల్ వాటర్ సప్లై) ఇంజనీర్లతో మంత్రి దామోదర రాజ నర్సింహ సమీక్ష

Date : 16 November 2024 03:42 PM

Telugu Rekha Media - రాష్ట్రీయం / సంగారెడ్డి : సంగారెడ్డి ఆర్డబ్ల్యూఎస్(రూరల్ వాటర్ సప్లై) ఇంజనీర్లతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ శనివారం రివ్యూ చేశారు. ఎస్ఈ రఘువీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఈఈ) విజయ లక్ష్మి, నాగభూషణం, సంపత్, పాషా, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు వెంటనే వాటర్ కనెక్షన్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ విద్యా సంస్థలో ప్రస్తుతం ఉన్న వాటర్ కనెక్షన్స్ సరిపోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ఆ ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తక్షణమే అదనపు కనెక్షన్స్ ఇవ్వాలని మంత్రి సూచించారు. మిషన్ భగీరథ పనితీరుపై మంత్రి ఆరా తీశారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వాటర్ సప్లై చేయిన్కు సంబంధించి రిపేర్లను, ఎప్పటికప్పుడు చేయించాలన్నారు. వేసవిలో తాగు నీటి సమస్య రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించిన పెండింగ్ బిల్స్ సమస్యను అధికారులు మంత్రి దృష్టికి రావడంతో, మంత్రి ఈ విషయంపై కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి బిల్లులు వెంటనే విడుదల చేయాలని సూచించారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను ప్రతి నెలా చెల్లించాలని, వారిని ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు మంత్రి సూచించారు. సంబంధిత మ్యాన్ పవర్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించాలని, రెగ్యులర్గా వేతనాలు విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెలాఖరులో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పరిశీలనకు వస్తానని అధికారులకు మంత్రి తెలిపారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :