Monday, 14 September 2026 03:41:15 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

గురుకుల స్కూళ్ల సమస్యలపై స్పందించడం అభినందనీయం...

-- కేటీఆర్‌.

Date : 14 August 2024 11:35 AM

Telugu Rekha Media - రాష్ట్రీయం / హైదరాబాద్ : రాష్ట్రంలో గురుకులాల పనితీరు, పరిశుభ్రతపై పార్టీ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటనతో ప్రభుత్వంలో చలనం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ హాస్టళ్ల బాటపట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ జగిత్యాల జిల్లా పెద్దాపూర్‌ గురుకుల హాస్టల్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ స్పందిస్తూ.. గురుకుల స్కూళ్ల సమస్యలపై మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.8నెలల్లో కలుషిత ఆహారంతో 500 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. నిన్న బీబీపేట పాఠశాలలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన భోజన వసతి కల్పించాలి. పాఠశాలల్లో వసతులు, సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్‌ కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1000కు పైగా గురుకులాల్లో ప్రాణనష్టం జరగకుండా.. ఆహార నాణ్యతను మెరుగుపరిచేందుకు డిప్యూటీ సీఎం, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: