Sunday, 01 March 2026 10:12:48 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం..

--ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్‌కాన్ ఛైర్మ‌న్ యంగ్ లియూ.

Date : 16 August 2024 04:25 PM

Telugu Rekha Media - జాతీయం / : ఇండ‌స్ట్రీ, స‌ర్వీస్ సెక్టార్ల‌తో పాటు అన్ని రంగాల్లో విస్త‌రించే స‌త్తా హైద‌రాబాద్ న‌గ‌రానికి ఉంద‌ని అంత‌ర్జాతీయ దిగ్గ‌జ పారిశ్రామిక సంస్థ ఫాక్స్ కాన్ ఛైర్మ‌న్ యాంగ్ లియూ అన్నారు. త్వ‌ర‌లోనే త‌న బృందంతో క‌లిసి హైద‌రాబాద్ న‌గ‌రాన్ని సంద‌ర్శిస్తాన‌ని ఆయ‌న తెలిపారు. ఫాక్స్ కాన్ ఛైర్మ‌న్ యాంగ్ లియూ నేతృత్వంలోని ఫాక్స్ కాన్ ప్ర‌తినిధి బృందం ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో ఆయ‌న అధికారిక నివాసంలో శుక్ర‌వారం ఉద‌యం స‌మావేశ‌మైంది. హైద‌రాబాద్ న‌గ‌రానికి ఉన్న చ‌రిత్ర‌.. పారిశ్రామిక సంస్థ‌ల విస్త‌ర‌ణ‌కు ఉన్న అనుకూల‌త‌, అద్భుత‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్ కాన్ బృందానికి వివ‌రించారు. 430 ఏళ్ల కింద పునాది రాయి ప‌డిన హైద‌రాబాద్‌ కాల‌క్ర‌మంలో మూడు న‌గ‌రాలుగా అభివృద్ధి చెందిన తీరును ముఖ్య‌మంత్రి తెలియ‌జేశారు. ప్ర‌భుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేక‌పోవ‌డంతోనే హైద‌రాబాద్ వేగంగా పురోగ‌తి చెందుతోంద‌న్నారు.. ఆ అభివృద్ధిని మ‌రింత‌గా ప‌రుగులు పెట్టించేందుకే తాము ప్ర‌స్తుత ప్ర‌పంచ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఫ్యూచ‌ర్ సిటీ పేరుతో నాలుగో న‌గ‌రానికి (ఫోర్త్ సిటీ) రూప‌క‌ల్ప‌న చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వివ‌రించారు. ఫోర్త్ సిటీలో విద్యా, వైద్యం, క్రీడా, ఎల‌క్ట్రానిక్స్‌-ఎల‌క్ట్రిక‌ల్‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇలా బ‌హుముఖంగా అభివృద్ధి చేయ‌నున్నామ‌ని చెప్పారు. ప్ర‌స్తుత ప్ర‌పంచానికి అవ‌స‌ర‌మైన స్కిల్స్‌ను యువ‌త‌కు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీని ప్రారంభిస్తున్నామ‌న్నారు. న‌వ త‌రం ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాలు, వాటికి అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు, భ‌విష్య‌త్తులో ఆయా ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాలు తీర్చే మాన‌వ వ‌న‌రుల‌ను అందించేందుకు అవ‌స‌ర‌మైన సిల‌బ‌స్ రూప‌క‌ల్ప‌నలో ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌లను భాగ‌స్వాముల‌ను చేస్తున్న‌ట్లు తెలిపారు. అందులో భాగంగానే స్కిల్ యూనివ‌ర్సిటీకి ఆనంద్ మ‌హేంద్ర‌ను ఛైర్మ‌న్‌గా, మ‌రో పారిశ్రామిక వేత్త శ్రీ‌నివాస రాజును వైస్ ఛైర్మ‌న్‌గా నియ‌మించామ‌ని తెలిపారు. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, ఔట‌ర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్‌), రీజిన‌ల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్‌)తో పాటు హైద‌రాబాద్‌కు ఉన్న అన్ని అనుకూల‌త‌ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వారికి వివ‌రించారు.

ఫోర్త్ సిటీలో ఫాక్స్ కాన్ సంస్థ ప‌రిశ్ర‌మ‌లు పెట్టేందుకు అవ‌స‌ర‌మైన అన్ని అనుమ‌తులు ఇవ్వ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు అంద‌జేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్ కాన్ ఛైర్మ‌న్ యాంగ్ లియూకి హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆహ్వానించారు. పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు, అందిస్తున్న ప్రోత్సాహాకాలు, ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో త‌మ బృందం అమెరికా, ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టించి దిగ్గ‌జ పారిశ్రామిక సంస్థ‌ల‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు, చేసుకున్న ఒప్పందాల‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు ఛైర్మ‌న్ యాంగ్ లియూకి వివ‌రించారు. ఫోర్త్ సిటీ రూప‌క‌ల్ప‌న‌లో ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌, పారిశ్రామిక అనుకూల విధానాలు త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌ని ఫాక్స్ కాన్ ఛైర్మ‌న్ యాంగ్ లియూ అన్నారు. ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో మీ విజ‌న్ అద్భుతంగా ఉందంటూ యాంగ్ లియూ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. తాను సాధ్య‌మైనంత త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ ను సంద‌ర్శిస్తాన‌ని తెలిపారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :