Saturday, 13 June 2026 02:15:44 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పాము కాటు వేయడంలోనూ... పద్ధతి...

Date : 10 July 2024 09:53 AM

Telugu Rekha Media - జాతీయం / : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచం నలుమూలలా ఎక్కడ ఏం జరిగిన కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఒక ఆశ్చర్యకరమైన ఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఒక వ్యక్తిని ఒక పాము నెలన్నర వ్యవధిలో ఆరు సార్లు కాటు వేసింది. అదృష్టం బాగుండి ఆ వ్యక్తి ప్రతి సారీ ప్రాణాలతో బయట పడుతున్నారు. అయితే ఇందులో అందరికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే పగ పట్టిన ఆ పాము అతడిని వేటాడి రెండు ప్రత్యేక రోజుల్లోనే కాటు వేస్తుంది. ఆ వ్యక్తి ఆ పాము నుంచి తప్పించుకోవడానికి ఊరు మారినప్పటికీ లాభం లేకపోయింది. పాము ఆ వ్యక్తిని వేటాడి పొరుగూరికి కూడా వెళ్లి కాటు వేస్తుంది. ఇలా మొత్తం ఆరు సార్లు ఆ పాము కాటు వేసింది. పాము కాటు వేసిన ప్రతి సారీ ఆ వ్యక్తి ఆసుపత్రి లో చికిత్స పొందటం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో జరిగింది.

యూపీ లోని ఫతేపూర్ లో ఈ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. పాము కు భయపడి ఆ వ్యక్తి తన ఇల్లు వదిలి తన మామ ఇంట్లో ఉంటున్నప్పటికీ ఆ పాము అతనిని వదలలేదు. దాంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వికాస్ దూబే అనే వ్యక్తి నెలన్న వ్యవధిలో ఆరు సార్లు పాము కాటుకు గురయ్యాడు. జూన్ 2 న రాత్రి 9 గంటలకు మంచం మీద నుంచి లేస్తూ కాలు కింద పెట్టగానే అతనిని మొదటి సారీ పాము కాటు వేసింది. రెండు రోజులు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స తర్వాత అతను కోలుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇది ఒక సాధారణ ఘటన అని అతని కుటుంబసభ్యులు భావించారు. అయితే జూన్ 10 న మళ్ళీ అతనిని పాము కాటు వేసింది. చికిత్స తర్వాత మళ్ళీ కోలుకున్న వికాస్ కు మనసులో పాముల భయం ఏర్పడింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కూడా ఈ సారి మళ్ళీ అతనిని జూన్ 17 న ఇంట్లోనే పాము కాటు వేసింది. మళ్ళీ మూడు రోజుల తర్వాత నాల్గవ సారీ పాము కాటు వేసింది. చికిత్స కోసం అతనిని మళ్ళీ అదే ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఈసారి ప్రాణాలతో బయటపడిన అతను తన బంధువుల సూచించినట్లు రాధనగర్ లోని తన మేనత్త ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా రాత్రి 10 గంటల సమయంలో మళ్ళీ పాము కాటు వేసింది. మళ్ళీ చికిత్స నుంచి కోలుకున్న తర్వాత అతను మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని తన మామ సంతోష్ దూబే ఇంటికి వెళ్ళాడు. అయితే జులై 6 తేదీన మధ్యాహ్నం మళ్ళీ తన మామ ఇంట్లో పాము ఆరో సారీ కాటు వేసింది. ఆసుపత్రిలో చేరిన అతను చికిత్స తర్వాత కోలుకొని ఇంటికి వెళ్ళాడు. అయితే ప్రతి సారీ తనను పాము శని, ఆది వారాల్లో కాటు వేస్తుందని అతడు చెప్పుకొచ్చాడు. ప్రతి సారి అతని ఒంటిపై పాము కాటువేసిన కొత్త గుర్తులు ఉంటున్నాయని వైద్యులు తెలిపారు. పాము కాటు వేసిన ప్రతి సారీ అతనికి యాంటీ స్నేక్ వెనం ఎమర్జెన్సీ మందులు ఇస్తున్నామని వైద్యులు తెలిపారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :