Sunday, 01 March 2026 10:13:13 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ నవంబర్ 4

Date : 04 November 2024 10:11 PM

Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు పెరగాలన్నారు. సర్కారు బడుల అభివృద్ధికి సమాజమంతా బాధ్యత తీసుకోవాలని సూచించారు మెరుగైన ఫర్నిచర్, ల్యాబ్స్‌పై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. విద్యానగర్ జామై ఉస్మానియా పాఠశాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బెంచీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు..కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం కనిపిస్తోందన్నారు దివాళకోరు, దగాకోరు రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు. అమలు కానీ హామీలు ఇవ్వడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని కిషన్ రెడ్డి చురకలంటించారు. ఇచ్చిన హామీలకే గతిలేదని, కొత్తగా మళ్లీ హామీలిస్తున్నారన్నారు. కర్నాటకలో హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అనేక వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారులోకి వచ్చిందని దుయ్యబట్టారు. డిక్లరేషన్, గ్యారంటీల పేరుతో గారడీ చేశారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :