Tuesday, 28 July 2026 09:51:47 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ప్రజలు, అధికారుల సహకారం మరువలేనిది...

-మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఎంపీపీ పూసల ప్రణయ్ కుమార్. -- ఎంపీపీగా ప్రణయ్ ప్రయాణం సక్సెస్ -- చిన్న వయసులోనే ఎంపీపీగా బాధ్యతలు --ప్రజల విశ్వాసాన్ని

Date : 05 July 2024 11:34 AM

Telugu Rekha Media - తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా తాండూరు మండల ఎంపీపీగా పూసాల ప్రణయ్ కుమార్ తన పదవీ కాలాన్ని సంపూర్ణంగా పూర్తి చేశారని చెప్పవచ్చు. అతి చిన్న వయసులోనే కాసిపేట గ్రామపంచాయతీ ఎంపీటీసీగా ఎన్నిక కాబడి అనంతరం అప్పటి టిఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆశీస్సులతో ఏకంగా మండల ఎంపీపీగా నియమించబడ్డాడు. అప్పటి వరకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ సదరు గ్రామపంచాయతీ ప్రజానీకం ప్రణయ్ కుమార్ కు ఎంపీటీసీగా పట్టం కట్టారు. అనంతరం ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సొంత గ్రామపంచాయతీ తోపాటు, ఇతర గ్రామపంచాయతీలను అభివృద్ధి పరచడానికి అహర్నిశలు శ్రమించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతానికి భిన్నంగా యువకుడు కావడం చేత నిత్యం ప్రజల్లో ఉంటూ , అటు సోదరా ఎంపిటిసి లను, ఇతర ప్రజాప్రతినిధులను, పార్టీ నాయకులను సమన్వయ పరుచుకుంటూ అభివృద్ధి చేశారని పలు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. మండలంలోని కొంతమంది ప్రజాప్రతినిధుల మధ్య అక్కడక్కడ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఓర్పుతో వారందరికి సద్ది చెబుతూ సమన్వయ పరిచిన తీరు పలువురుని ఆకట్టుకుంది. తన పదవి కాలం పూర్తయిన సందర్భంగా సదరు యువనేత ఎంపీపీ పూసల ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన ప్రజలకు, అప్పటి ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రతి ఒక్క అధికారి నాకు సంపూర్ణంగా సహకరించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎలాంటి అవిశ్వాసాలకు తావివ్వకుండా, విశ్వాసం గా పని చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. నేను ఎంపీపీ గా పదవి బాధ్యతలు చేపట్టిన నాటినుండి శక్తి వంచన లేకుండా పనిచేశానన్నారు. భవిష్యత్తులో ప్రజలు మరో మారు నన్ను ఆశీర్వదించి వారి సేవకు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నానన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :