Tuesday, 28 July 2026 09:04:24 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు...

Date : 26 June 2024 02:07 PM

Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి : సైబర్ నేరాల టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలి లేదా https://cybercrime.gov.in/ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.ఏసిపి వెంకటరమణ తెలిపారు. రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్.ఆదేశాల ప్రకారం బుధవారం ఆర్జీ వన్ పరిధిలోని 11 వ బొగ్గు గని పై. సైబర్ నేరాలపై సింగరేణి కార్మికులకు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ....సాదారణగా ప్రజలు అత్యాశ,వలన సైబర్ నేరాలకు గురి అవుతున్నారని అనారు.ప్రస్తుతంసమాజంలో సైబర్.నేరగాళ్ళు.ఎన్నో రకాలుగా అమాయక ప్రజల నగదును దోచుకుంటున్నారని, సైబర్ నేరాల బారిన పడే వారి సంఖ్యపెరుగుతుందనిఅన్నారుప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతి జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. మహిళలను ఎరచూపి వీడియో కాల్స్ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారని ఇలాంటి వాటిపైవ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు.ఈ మధ్యకాలంలో పిల్లలు,యువత ఆన్లైన్ యాప్ ల ద్వారా లోన్లు తీసుకొని ఆ డబ్బులతో రమ్మీ గేమ్,ఇతర ఆన్లైన్.గేమ్స్.ఆడుతూ మోసపోతూ ప్రాణాలు తీసుకుంటున్నారని మీ పిల్లలు మోసపోకుండా తగిన జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాలని, వారి ప్రవర్తన మరియు మొబైల్ ఉపయోగం పై పర్యవేక్షణ ఉండాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తమ బంధువులు,స్నేహితులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ బాధ్యతగా మెలగాలని సూచించారు.ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో,అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎవరో తెలియని నేరస్థుడు సాంకేతికతను, ప్రజల అమాయకత్వాన్ని ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్ల రూపంలో దోచుకుంటున్నారని అన్నారు. ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి యుండి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏదైనా సైబర్ నేరగాని చేతిలో మోసపోయిన వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: