Tuesday, 28 July 2026 09:45:09 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి...

Date : 30 July 2024 04:33 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావాహులలో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తై ఆరు నెలలు అవుతుండగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ల పదవీకాలం ఈనెల ఐదున ముగిసిన విషయం తెలిసిందే, పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి ఏర్పడింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావహులు ఇప్పటికే ప్రజలను, ఆయా గ్రామాలలో మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. చిన్న శంకరంపేట మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి గతంలో ఉన్న రిజర్వేషన్ మారుతి ఎవరు? మారకపోతే ఎవరు? పోటీచేయాలని దీనిపై గ్రామాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఒక్కొక్క పార్టీ నుండి ముగ్గురు లేదా నలుగురు ఆశావహులు పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలతో పాటు ఆరు గ్యారెంటీల పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ సైతం ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకుని పంచాయతీలో గెలవాలని చూస్తోంది అనే సమాచారం. అలాగే మెదక్ ఎంపీ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలవడంతో బీజేపీ పార్టీకి చెందిన యువత కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో నిలబడి గెలవాలని రెండు మూడు రోజుల క్రితం మండలం లో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి చర్చించినట్లు తెలిసింది. తాజా, మాజీలు కొత్త వ్యక్తులు సర్పంచ్ కొరకు పోటీ చేసేందుకు నిమగ్నమై ఉన్నారు. స్థానిక సంస్థలు ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది ముఖ్యంగా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచడం కోసం బీసీ జన గణన చేస్తామని ప్రకటించింది ప్రస్తుతం రిజర్వేషన్లు పరిశీలిస్తే పదిహేను శాతం ఎస్సీలకు ఆరు శాతం ఎస్టీలకు 24 శాతం బీసీ రిజర్వేషన్లను ఇప్పటికే అమలై ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలి.ఈ క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఆ పంచాయతీలకు కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయి. ఆరు నెలల నుంచి పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీలకు కావలసిన నిధులు ఆగిపోయాయి. దీంతో గ్రామపంచాయతీలో ప్రజలకు కల్పించాల్సిన సదుపాయాలకు కావలసిన నిధులు రాకపోవడంతో పాలన కుంటుపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఆగస్టు మొదటి వారం లోపు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని, అదికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో, గ్రామాలలోని పంచాయతీ ఎన్నికలు త్వరలో రానున్నట్లు తెలుసుకున్న ఆశావహులు గ్రామాలలో ఎన్నికల సందడి నెలకొంది.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :