Sunday, 13 September 2026 04:42:32 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

హుస్నాబాద్ లో మెగా జాబ్ మేళా...

Date : 24 June 2024 04:52 PM

Telugu Rekha Media - తెలంగాణ / కరీంనగర్ : యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత వైస్ చైర్మన్ అయిలేని అనిత, సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఆర్డీవో శ్రీరామమూర్తి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఇతర అధికారులు పాల్గోన్నారు. ఈ మెగా జాబ్ మేళ కి మంచి స్పందన వచ్చింది. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున హజరయింది. దాదాపు 60 కి పైగా కంపెనీలు పాల్గొన్నాయి. 5000 ఉద్యోగాల నియామకం చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. జాబ్ మేళా కి వచ్చిన వారికి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి హెల్త్ క్యాంప్ లు, బోజన వసతులు ఏర్పాటు చేసారు. మంత్రి మాట్లాడుతూ యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా కు జీరో నుండి పీజీ వరకు హుస్నాబాద్ నియోజవర్గం నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వారు 6 వేల మంది ఉన్నారు. హుస్నాబాద్ జీరో టూ పీజీ వరకు జాబ్ మేళా లో పాల్గొనడానికి వచ్చిన వారికి స్వాగతం కు ఎక్కడ ఏ కంపనీ లో జాబ్ కావాలంటే అక్కడ ఇంటర్వ్యూ కి అటెండ్ కావాలి. తదుపరి జాబ్ మేళా మండల స్థాయిలో నిర్వహిస్తాం. జాబ్ మేళా కోసం వేలాది గా యువత తరలివచ్చారు. వారందరికీ మంచి అవకాశం. మీకు ఉన్న నైపుణ్యం తో కావాల్సిన ఉద్యోగం తో ఇక్కడి నుండి వెళ్ళాలని కోరుతున్న. ఇవే కాకుండా విదేశాల్లో కూడా నర్సింగ్, నిర్మాణ రంగం, ఇతర రంగాల్లో లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. మండలాల వారిగా ఇలాంటివి ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రాత్రి 10 అయినా సరే ఇక్కడే ఉండి ఓపికగా ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. హుస్నాబాద్ లో మొదటిసారి జాబ్ మేళా జరుగుతుంది. ప్రభుత్వం నుండి పకడ్బందీగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. నిరుద్యోగులకు దాదాపు ఉద్యోగాలు వచ్చేలా అవకాశాలు కల్పించాలి. ఇవే కాకుండా పాల ఉత్పత్తి, చేపల పెంపకం, గ్రామీణ పరిశ్రమలు కల్పించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి టూరిజం గా కూడా అభివృద్ధి చేస్తాం. ఎవరు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి. అందరూ మంచిగా ఇంటర్వూ చేస్తూ ఉద్యోగాలు పొందే లెటర్ లతో పోవాలి. ఉద్యోగాలు పొందే యువతకు అందరికీ శుభాకాంక్షలని అన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: