Thursday, 29 October 2026 07:47:17 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

శాఖాహారంతో శాంతికి మార్గం...

- శాకాహార ర్యాలీ లో బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి కోవూరి సత్యనారాయణ గౌడ్.

Date : 29 July 2024 08:14 PM

Telugu Rekha Media - తెలంగాణ / సంగారెడ్డి : శాఖాహారం శాంతికి మార్గం-అని పత్రీజీ ఆశయాలను దృష్టిలో ఉంచుకొని శాంతి మార్గం లో పయనించాలని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పిలుపు నిచ్చారు. సంగారెడ్డి పట్టణంలో ఉమ్మడి మెదక్ జిల్లా పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా శాకాహార ర్యాలీ రాజీవ్ పార్క్ న్యూ బస్టాండ్ నుండి మొదలై హైదరాబాద్ గార్డెన్ ఫంక్షన్ హాల్ విజయవంతంగా సాగింది. ఈ సందర్బంగా మహాత్ముల యొక్క బాటను అనుసరిస్తూ, గురువుల యొక్క బాటను అనుసరిస్తూ ఈ యొక్క భారతదేశంలో మానవ దేహం దేవాలయం లాంటిదని అట్టి దేవాలయం ఆత్మ పరమాత్మతో కూడినదని అట్టి జ్ఞానాన్ని మానవుడు తెలుసుకున్న నాడే నిజమైన జీవన విధాన మార్గాన్ని అనుసరిస్తున్నాడని, తద్ మార్గం ధ్యానమార్గం ద్వారానే సాధ్యమని తెలియజేస్తూ మనిషి పుట్టుకతోనే జీవన విధానం శాకాహార జీవన విధానం అని గొప్ప గొప్ప మేధావులు, గురువులు, మరియు పిరమిడ్ మాస్టర్లు తెలియపరిచిన మాటలను పునరావృతం చేస్తూ శాఖాహార సభలో ఉన్నటువంటి ధ్యానులకు తెలియజేశారు. హైదరాబాద్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ప్రముఖ ప్రముఖ మేధావుల గురువుల మరియు పిరమిడ్ ధ్యానులతో సమావేశమై శాఖాహారం యొక్క విశిష్టతను మేధావులు, వక్తలు,గురువులు మరియు పిరమిడ్ మాస్టర్లు తెలియజేశారు. తదనంతరం గురువులను మేధావులను వక్తలను శాలువాలతో ఘనంగా ఉమ్మడి మెదక్ పిరమిడ్ మాస్టర్లు సన్మానించారు.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, పీఠాధిపతులు వట్టిపల్లి గురువు శివమణి, శ్రీవిద్య ఉపాసకుడు సంజీవ్ మహారాజ్, బ్రహ్మకుమారిస్ అక్కయ్య సుమంగళ సుకన్య, ఇతర పీఠాధిపతుల తో పాటు బ్రాహ్మణ రత్నమారం శివప్రసాద్ మాస్టర్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్ కుమార్, మహేశ్వర పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి , సభ నిర్వాహక అధ్యక్షులు సంగమేశ్వర్ , శ్రీనివాస్ , మెదక్ పిరమిడ్ పార్టీ కాంటెస్టెడ్ ఎంపీ సాయి గౌడ్, బోధన్ సాయిలు మాస్టర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి సంఘప్ప గౌడ్, పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇంచార్జ్ కరాటే మాస్టర్ అశోక్, సంగారెడ్డి జిల్లా ఆర్గనైజర్ దత్తు మాస్టర్, నారాయణఖేడ్ ధ్యాన కేంద్ర ఇంచార్జ్ విఠలాచారి, పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ సుజాత గంగారెడ్డి, సేవాదళ్ అధ్యక్షులు భూపతి రాజుగారు, సినీ ఫైటర్ మౌన స్వామి సిద్దిపేట నరసింహులు గౌడ్, సైదులు మాస్టర్, పిరమిడ్ మాస్టర్లు రాఘవరెడ్డి, కృష్ణ మాస్టర్ మరియు అధిక సంఖ్యలో పిరమిడ్ ధ్యానులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: