Thursday, 30 July 2026 03:18:36 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి...

-- ఓవర్ లోడ్, అతి వేగంగా వెళ్తే చర్యలు తీసుకోవాలి... ఇసుక పాలసీకి విధి విధానాలు రూపొందిస్తాం... --జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

Date : 13 July 2024 09:38 PM

Telugu Rekha Media - తెలంగాణ / భూపాలపల్లి : జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో అక్రమ ఇసుక రవాణా అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఇసుక పాలసీకి విధి విధానాలు రూపకల్పనపై పోలీస్, రెవెన్యూ, మైనింగ్, రవాణా, టిజిఎండిసి, జాతీయ రహదారులు, భూ గర్భ జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో జిల్లా వ్యాప్తంగా వాగుల నుండి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా, గోదావరి పరివాహక ప్రాంతాలలోని ఇసుక రీచ్ ల వద్ద లారీలు, ఇష్టారీతిన నడుపుతున్నారని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అతివేగం, ఓవర్ లోడ్ తో, సరైన వే బిల్లులు లేకుండా లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టి జి ఏం ఐ డి సి అధికారుల పర్యవేక్షణ కొరవడిందని జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలకు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా, అనుమతులు ఉన్న కట్టడాలకు జి.ఓ నంబర్ 03 ప్రకారం పంచాయితీ కార్యదర్శులు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు సంయుక్తంగా రాత్రి వేళల్లో పటిష్ఠ పహారా ఉండాలని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేయలన్నారు. ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు టీజీఎంఐడిసి అధికారుల అనుమతులు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు.జిల్లాలో పలుచోట్ల అక్రమంగా నిలువ చేసిన ఇసుక రీచ్ లను గుర్తించాలని, అక్రమంగా ఇసుక నిల్వ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను, పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రధాన రహదారుల గుండా వేగంగా, ఓవర్ లోడ్ తో వే బిల్లులు లేకుండా నడుస్తున్న లారీలను గుర్తించడానికి రవాణాశాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పరిమితికి మించి అధిక లోడ్ వల్ల రహదారులు దెబ్బతింటున్నాయని అలాంటి వాహనాలను గుర్తించి డ్రైవర్ పై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మంగీలాల్, మైనింగ్ అధికారి జయరాజ్, జాతీయ రహదారుల ఈ ఈ మనోహర్ భూగర్భ జల శాఖ అధికారి, తహసిల్దారులు, సిఐలు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: