Tuesday, 28 July 2026 09:47:33 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మన గ్రామ ప్రభుత్వ పాఠశాలలను బతికించుకుందాం...

తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి పిలుపు...

Date : 22 July 2024 11:21 PM

Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : సోమవారం జగదేవ్ పూర్ మండలంలోని నిర్మల్ నగర్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ సెంటర్, అలిరాజ్ పేట ప్రాథమిక పాఠశాల, మరియు జగదేవ్ పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, గజ్వేల్ మండలంలోని అక్కారం గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు. 2015 నుండి నిర్మల్ నగర్ ప్రాథమిక పాఠశాల, అలిరాజ్ పేట ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు రాక మూతపడడంతో ఈ విద్యా సంవత్సరంలో గ్రామాల్లో ప్రజలను ప్రోత్సాహించి పాఠశాలల్లో చేరేలా తల్లిదండ్రులను ఓప్పించినందుకు విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. పాఠశాలల్లో రెగ్యులర్ టీచర్ లేరని, అలాగే మరుగుదొడ్లు తాగునీటి వసతి కల్పించాలని, పాఠశాల ఆవరణ ప్రహరీ గోడ బాగుంది కాని కుక్కలు లోనికి పోకుండా పెద్ద గేట్ ని ఏర్పాటు చెయ్యాలని తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ ని కోరారు. సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకే పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నానని, అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు. అన్ని పాఠశాలల్లో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కెజిబివి పాఠశాల తరగతి గదిలో విద్యార్థులకు గణితంలో గుణితాలకు సంబందించిన సబ్జెక్ట్ ని బోధించారు. ఎదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే సబ్జెక్ట్ గుర్చి పూర్తి అవగాహన కలిగి ఉండి షార్ట్ కట్ మెథడ్ లొ సమస్యలు పరిష్కరించేలా ఆలోచించాలని, లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటేనే సబ్జెక్టు వస్తాయని, తెలుగు మన మాతృభాష మనం రోజు ఇంట్లో బయట అందరూ అదే భాషను మాట్లాడటం వల్ల సులభంగా అర్థమవుతుంది మాట్లాడుతాం. అలాగే హిందీ, ఇంగ్లీష్ లలో కూడా పాఠశాల, ఆవరణలో తరచూ మాట్లాడుతూ ఉంటే ఆ సబ్జెక్టులు కూడా సులభంగా అర్థం చేసుకోవడం, చదవడం మాట్లాడగలుగుతామని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారము భోజనం పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అక్కారం ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిలో విద్యార్థులతో బోర్డు పై గణిత సమస్యలు పరిష్కరించినందుకు చప్పట్లు కోట్టి అభినందించారు. పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని భుజించారు. అలాగే విద్యార్థులు భోజనంలో కూరను కలుపుకొని తినేలా తెలపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఏదో మొక్కుబడిగా భోజనం పెడుతున్నం వారు తింటున్నారు అని కాకుండా రుచికరమైనదిగా తయారీ చేసి పిల్లలు తప్పకుండా పూర్తిగా తినేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు తెలిపారు. పాఠశాలలో పిల్లలకు నల్లా సమస్య ఉందని గమనించి ఇంజనీరింగ్ ఏజెన్సీ బ్యాటరీ ఆప్ ట్యాప్ కనెక్షన్ నిర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని సూచించారు. మెనూ ప్రకారం పిల్లలకు గుడ్లు, ఆకుకూరలు పప్పులు లాంటి పౌష్టికాహారాన్ని అందించాలని వంట సిబ్బందికి తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, కేజీబీవీ మరియు మోడల్ స్కూల్ లాంటి అనేక పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. పిల్లలు ప్రవేట్ పాఠశాలల కాకుండా గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించేందుకు ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని అలాగే పాఠశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రతి ఒక్క ఫెసిలిటీ అందించే విధంగా తయారు చేస్తున్నాం. పాఠశాలలో మంచి వాతావరణాన్ని తయారు చేయడానికి వివిధ పాఠశాలలను తరచు పర్యవేక్షణ చేస్తూ ఉంటానన్నారు. జిల్లాలో మూతపడిన పాఠశాలలు, తక్కువ విద్యార్థులు గల పాఠశాలల పై ఎక్కువ శ్రద్ధ తీసుకొని తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించేందుకు మోటివేషన్ మరియు కన్విన్స్ అయ్యేలా చేసే కార్యచరణ రూపొందించడం జరిగిందని దాంట్లో భాగంగానే మండలాల్లో గల పాఠశాలను పర్యటించడం జరుగుతుందని తెలిపారు. కేజీబీవీ సంబంధించి ఆవరణ చుట్టూ ప్రహరీ గోడ సమస్య ఉన్నదని తెలుపగా సర్వేయర్ ని పిలిచి చుట్టూ డిమార్కింగ్ చేసి ప్రహరీ గోడ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక ఆర్డిఓ ఆర్డిఓ బన్సీలాల్, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, సెక్టోరల్ అధికారి రామస్వామి, ఎంపీడీవో యాదగిరి, మరియు విద్యాశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: