Wednesday, 29 July 2026 10:42:04 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం...

-- ఒక్కరు రక్త దానం చేస్తే ముగ్గురి ప్రాణాలను కాపాడిన వారవుతారు. -డీఎంహెచ్ఓ డాక్టర్. బి. సాంబశివ రావు

Date : 14 June 2024 04:20 PM

Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : “ప్రపంచ రక్త దాతల దినోత్చవo” సంధర్భంగా ఈ రోజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ముందుగా జి‌ఎం‌హెచ్ బ్లడ్ బ్యాంక్ లో రక్త దాన శిబిరమును డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్. బి. సాంబశివ రావు, జి‌ఎం‌హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి గారితో కలసి ప్రారంభించడం జరిగింది. అనంతరం డాక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో కలసి ర్యాలీ నిర్వహించి తదనంతరం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి మెయిన్ రోడ్ వద్ద మానవ హారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

ఈ సంధర్భంగా హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్. బి. సాంబశివ రావు గారు మాట్లాడుతూ 2004 లో మొదటి సారి ప్రపంచ రక్త దాతల దినోత్చవo నిర్వహించడం జరిగిందని ఇప్పటికీ 20 సంవత్చరాలు పూర్తి అయినుందున రక్త దాతలకు కృతజ్ఞతలు తెలియచేస్తూ “20 years of celebrating giving: Thank You Blood Donors”అనే థీమ్ తో ముందుకు రావడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు రక్త దానo చేయడానికి ముందుకు రావాలని ఒక్కరు రక్త దానం చేస్తే ముగ్గురి ప్రాణాలను కాపాడిన వారమవుతామన్నారు. జిల్లాలో 2 (ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, హనుమకొండ, సి‌హెచ్‌సి పరకాల ) ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ లతో పాటుగా రెడ్ క్రాస్ మరియు 8 గుర్తింపు పొందిన ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జి‌ఎం‌హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి గారు మాట్లాడుతూ రక్త దానం చేయడానికి యువకులు ముందుకు రావాలని తాము రక్త దానం చేస్తూ ఇతరులకు మార్గదర్శకంగా నిలబడాలన్నారు. జి‌ఎం‌హెచ్ ఆవరణలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వలన ఆసుపత్రికి వచ్చే మహిళలకు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా సౌకర్యంగా ఉందన్నారు. ఎలాంటి అపోహలకు లోనవకుండా రక్త దానానికి ముందుకు రావాలని పెద్ద వారిలో దాదాపు ఆరున్నర లీటర్ల రక్తం ఉంటుందని రక్త దాన సమయంలో కేవలం 400 మిల్లీ లీటర్ల లోపు సేకరిoచడం జరుగుతుందని ముఖ్యంగా యువత ముందుకు రావాలని, ప్రతి మూడు నెలల ఒకసారి తిరిగి రక్త దానం చేయవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్. బి. సాంబశివ రావు, జి‌ఎం‌హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తో పాటు అడిష్ నల్ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్.టి. మదన్ మోహన్ రావు, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎం‌డి. యాకూబ్ పాషా, డాక్టర్ ఉషా రాణి, ఆర్‌ఎం‌ఓ డాక్టర్ సారంగం, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ హిమ బిందు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, డాక్టర్ గీతా రాణి, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, DAPCU డిస్ట్రిక్ట్ మేనేజర్ స్వప్న కుమారి, HEEO చంద్ర శేఖర్, DPMO సుశీల, CHO మాధవ రెడ్డి, DAPCU నుండి రామకృష్ణ, కమలాకర్, హెచ్‌ఈ‌ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: