Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : రామడుగు రామడుగు మండల కేంద్రంలోని బేడ బుడగ జంగాల కులస్తులకు(ఎస్సీ) కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని రామడుగు ఎస్సీ మాదిగ పెద్ద మనుషుల సంఘం ఆధ్వర్యంలో తహశీల్దారు వినతిపత్రం అందజేశారు. మేము రామడుగు గ్రామంలో పుట్టినప్పటి నుండి మేము మాదిగ కులస్తులము మా గ్రామమునకు ఇటీవల బుడిగజంగా కులమునకు చెందిన కులం వారు వలస వచ్చి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు బుడిగజంగాలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదు, కానీ తెలంగాణ ప్రభుత్వం బెడ బుడగ జంగాలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను ఇస్తున్నారు. వారు ఎక్కడ నుంచి వలస వచ్చారో తెలియదు వారికి ఎస్సీ కులదృవీకరణ పత్రం ఇవ్వడం వలన మా మాదిగ కులస్తులు నష్టపోతున్నామని కావున బేడ బుడగ జంగాల వారికి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వకూడదని ఎస్సీ మాదిగ కులస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మాదిగ పెద్దమనుషులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media