Saturday, 13 June 2026 12:52:18 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయండి-

-- శాసనసభలో డా.పాల్వాయి హరీష్ బాబు ఆగ్రహం.

Date : 30 July 2024 10:26 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ : నిధులు కేటాయించని పక్షం లో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయండి- శాసనసభలో సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శాసనసభలో డా.పాల్వాయి హరీష్ బాబు ఆగ్రహంశాసనసభలో ఈరోజు సాగునీటి రంగం మరియు సివిల్ సప్లైస్ పై జరిగిన పద్దుల చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు నిధులు కేటాయించని పక్షంలో పక్కనే ఉన్న మహారాష్ట్రలో కలిపేయమని డిమాండ్ చేశారు. తమ ఆవేదనను సభ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నామని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం శాసనసభ కమిటీ వేయాలని, వెనకబాటుతనంపై అధ్యయన మరియు పరిష్కార మార్గాలు సూచించాలని కోరారు.అలాగే తుమ్మిడి హెట్టి వద్ద డా.బి.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని, జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు, ఆడ ప్రాజెక్టులను పూర్తిచేయాలని , పిపిరావు ప్రాజెక్టు పూడిక తీసి 11 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని కోరారు.గత ప్రభుత్వం కేవలం దక్షిణ తెలంగాణకు నీళ్లు తరలించి ఉత్తర తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని, వాటిని సవరించాలని కోరారు.కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు రోడ్ల నిర్మాణం కోసం రూ.12 కోట్ల నిధులు అటవీ శాఖకు చెల్లించాలని కోరారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :