Tuesday, 28 July 2026 07:15:13 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఇష్టపడి చదివితేనే లక్ష్యాలను చేరుకోవచ్చు...

-- నిట్ ప్రొఫెసర్ కొత్త లక్ష్మారెడ్డి

Date : 29 June 2024 04:17 PM

Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి : గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో సిరి ఫంక్షన్ హాల్ లో వరంగల్ లోని నిట్ లో పనిచేసిన ప్రముఖ విశ్రాంత ప్రొఫెసర్ కొత్త లక్ష్మారెడ్డి గారిచే పాఠశాలలోని 8, 9, 10 వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఏ విషయంలోనైనా వంద శాతం పరిపూర్ణులు కారు అనీ, ప్రతి ఒక్కరికీ కొన్ని తెలియని విషయాలు కూడా ఉంటాయన్నారు. కానీ మనం కష్టపడి చదువుతూ ఆయా విషయాల పట్ల అవగాహన పెంచుకుంటూ, మన జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకునే అవకాశం మాత్రం ఉందన్నారు. ఈ క్రమంలో ఆయన థర్మో డైనమిక్స్ సూత్రాలను మన నిత్య జీవితానికి అన్వయిస్తూ చెప్పిన ఉదాహరణలు విద్యార్థులను ఆలోచింపజేసాయి. పిల్లలందరూ జ్ఞానాన్ని ఆర్జించాలనే ఒక తృష్ణతో నిరంతరం అభ్యసనం చేస్తూ ఉంటేనే మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుందన్నారు. అనంతరం గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లెంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులలో విద్య పట్ల, తమ తమ లక్ష్యాల సాధన పట్ల ప్రేరణ కలిగించేలా చేయడానికి ఈ రోజు ప్రముఖ రసాయన శాస్త్ర రిటైర్డ్ ప్రొఫెసర్ ని మా పాఠశాలకు ఆహ్వానించడం జరిగిందన్నారు. ఆయన చెప్పిన విషయాలను అందరూ అవగాహన చేసుకొని, నిర్దేశిత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని అల్లెంకి మహాలక్ష్మి కళ్ళకు గంతలు కట్టుకొని వివిధ వస్తువుల పేర్లు, రంగును కేవలం వాసన ద్వారా కనుగొని చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, రమేష్ బాబు, లింగేశ్వర్, రిజ్వాన్, స్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: